మోదీపై నిప్పులు చెరిగిన అసదుద్దీన్ ఓవైసీ

ABN , First Publish Date - 2020-08-05T21:57:52+05:30 IST

తన ప్రసంగంలో భావోద్వేగానికి లోనాయనన్న ప్రధాని వ్యాఖ్యలను ఓవైసీ ప్రస్తావిస్తూ.. ఈ దేశ పౌరుడిగా తాను కూడా అంతే తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యానని చెప్పుకొచ్చారు.

మోదీపై నిప్పులు చెరిగిన అసదుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్: రామ మందిర నిర్మాణ శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకావడాన్ని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పు పట్టారు. ప్రజాస్వామ్య, లౌకిక విలువలకు కట్టుబడి ఉంటానని పదవీ స్వీకారంలో చేసిన ప్రమాణాన్ని మోదీ ధిక్కరించారని మండిపడ్డారు. కాగా, పునాది రాయి వేసిన అనంతరం తన ప్రసంగంలో భావోద్వేగానికి లోనాయనన్న ప్రధాని వ్యాఖ్యలను ఓవైసీ ప్రస్తావిస్తూ.. ఈ దేశ పౌరుడిగా తాను కూడా అంతే తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యానని చెప్పుకొచ్చారు.


‘‘ఈరోజు ప్రజాస్వామ్యం, లౌకికవాదం ఓడిపోయి హిందుత్వం గెలిచింది. ప్రధానమంత్రి తన ప్రమాణ స్వీకారాన్ని ధిక్కరించి రామ మందిరానికి పునాది రాయి వేశారు. లౌకిక దేశమైన ఇండియాలో ఇలాంటివి జరగడమేంటి? పునాది రాయి వేసిన అనంతరం భావోద్వేగానికి లోనాయ్యానని తన ప్రసంగంలో ప్రధాని చెప్పుకొచ్చారు. ఈ దేశ పౌరుడిగా, వారితో పాటే జీవిస్తున్న వాడిగా నేనూ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాను. ఎందుకంటే 450 ఏళ్ల నుంచి ఆ ప్రాంతంలో మసీదు ఉంది’’ అని ఓవైసీ అన్నారు.

Updated Date - 2020-08-05T21:57:52+05:30 IST