AIMIM: అయోధ్య జిల్లా నుంచి ఒవైసీ ఎన్నికల ప్రచారం ప్రారంభం

ABN , First Publish Date - 2021-09-07T16:30:42+05:30 IST

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం అయోధ్య నగరం నుంచి ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు....

AIMIM: అయోధ్య జిల్లా నుంచి ఒవైసీ ఎన్నికల ప్రచారం ప్రారంభం

అయోధ్య(ఉత్తరప్రదేశ్): ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం  అయోధ్య జిల్లా నుంచి ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అయోధ్య జిల్లా నుంచి మంగళవారం ‘వంచిత్-షోషిత్ సమాజ్’ సమావేశంలో ప్రసంగిస్తూ ప్రచారాన్ని  ప్రారంభిస్తారని యూపీ ఎంఐఎం రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడు షౌకత్ అలీ చెప్పారు. అయోధ్య నగరానికి 57 కిలోమీటర్ల దూరంలోని రుదౌలి తహసీల్ నుంచి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల ప్రచార సభలో ఒవైసీ ప్రసంగిస్తారని అలీ పేర్కొన్నారు. అయోధ్య జిల్లాను ఫైజాబాద్ అని సోషల్ మీడియాలో ఎఐఎం పోస్టర్లలో పేర్కొంది. హిందూ సమాజాం మనో భావాలను ఒవైసీ దెబ్బతీస్తున్నందున ఎంఐఎం ర్యాలీని నిషేధించాలని బీజేపీ కోరుతోంది.


ఫైజాబాద్ జిల్లా పేరును 2018 నవంబర్‌లో అయోధ్యగా మార్చారు.ఒవైసీ అయోధ్య సందర్శించడానికి అనుమతించమని హనుమాన్ గార్హి ఆలయ పూజారి మహంత్ రాజు దాస్ చెప్పారు. ఒవైసీ పాల్గొనే సమావేశానికి ముస్లింలతో పాటు, దళితులు, వెనుకబడిన,అగ్రవర్ణ హిందువులను కూడా ఆహ్వానించినట్లు యూపీ ఎంఐఎం నేత అలీ చెప్పారు.యూపీ ఎన్నికల్లో గెలిస్తే అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎంఐఎం పనిచేస్తుందని అలీ అన్నారు.ఉత్తర ప్రదేశ్‌లోని 100 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతామని ఎంఐఎం ప్రకటించింది.

Updated Date - 2021-09-07T16:30:42+05:30 IST