టీవీవీ దినకరన్‌తో ఎంఐఎం పొత్తు

ABN , First Publish Date - 2021-03-09T00:35:26+05:30 IST

అమ్మ మక్కల్ మున్నెట్ర కజగమ్ అధ్యక్షుడు టీవీవీ దినకరన్‌తో ఎంఐఎం పొత్తు కుదుర్చుకుంది. పొత్తులో భాగంగా

టీవీవీ దినకరన్‌తో ఎంఐఎం పొత్తు

చెన్నై : అమ్మ మక్కల్ మున్నెట్ర కజగమ్ అధ్యక్షుడు టీవీవీ దినకరన్‌తో ఎంఐఎం పొత్తు కుదుర్చుకుంది. పొత్తులో భాగంగా మూడు స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయించుకుంది. అయితే మొదట్లో డీఎంకేతో పొత్తు కుదుర్చుకోవాలని ఎంఐఎం నిర్ణయించుకుంది. అయితే డీఎంకేతో ఇప్పటికే పయనిస్తున్న ముస్లిం నేతలు అందుకు అడ్డు తగిలారు. దీంతో ఎంఐఎం టీవీవీ దినకరన్‌ వైపు మొగ్గు చూపింది. అయితే ఈ ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీకి దిగితే బాగుటుందని ఎంఐఎం తమిళనాడు శాఖ ఒవైసీకి ఓ రిపోర్టు ఇచ్చింది. చివరకు టీవీవీ దినకరన్‌తో వెళ్లాలని ఒవైసీ నిర్ణయించుకున్నారు. 


Updated Date - 2021-03-09T00:35:26+05:30 IST