ఒవైసీ ఖండించకపోవడం సిగ్గుచేటు: సంజయ్‌

ABN , First Publish Date - 2020-04-03T07:24:50+05:30 IST

గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై దాడి జరిగిన ఘటనను మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఖండించకపోవడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.

ఒవైసీ ఖండించకపోవడం సిగ్గుచేటు: సంజయ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై దాడి జరిగిన ఘటనను మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఖండించకపోవడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. మైనారిటీ ఓట్లతో పబ్బం గడిపే ఒవైసీ, కరోనా నివారణకు పిలుపునివ్వకపోవడం శోచనీయమని విమర్శించారు. ఒవైసీ ఆస్పత్రిని ఐసోలేషన్‌ వార్డుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై, నిజామాబాద్‌లో సిబ్బందిపై జరిగిన దాడిని బీజేపీ నేత కె.లక్ష్మణ్‌ ఖండించారు. క్లిష్ట సమయంలో వైద్యులకు అన్ని విధాలా అందరూ సహకరించాలని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు విజ్ఞప్తి చేశారు. ‘మర్కజ్‌’ వెనుక కుట్ర కోణంపైనా విచారణ అవసరమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి చెప్పారు. 

సింగరేణి కార్మికుల జీతంలో కోత సరికాదు

కోవిడ్‌-19 పేరుతో సింగరేణి కార్మికుల జీతంలో కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-03T07:24:50+05:30 IST