Abn logo
Sep 7 2021 @ 19:42PM

Asaduddin owaisi : నా పరువు పోగొట్టుకోను....

లక్నో : సమాజ్‌వాదీతో పొత్తు విషయమై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మాభిమానంతో చెలగాటాలు ఆడలేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం అయోధ్యలో పర్యటించారు. ఈ సందర్భంగా  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్‌తో పొత్తు పెట్టుకుంటారా? అని విలేకరులు ప్రశ్నించగా... ‘‘ఈ ప్రశ్నకు సమాధానం అఖిలేశ్‌ను అడగండి. అందరూ నన్నుఅడుగుతున్నారు. ఆత్మాభిమానంతో నేను చెలగాటాలు ఆడలేను. పొత్తు విషయంలోనే చర్చలంటూ జరిగితే పక్కాగా, ఇరు పక్షాల నుంచీ జరగాల్సిన అవసరం ఉంది.’’ అని ఒవైసీ ఘాటుగా వ్యాఖ్యానించారు. యూపీలో ఉన్న ముస్లింలు అత్యంత ఇబ్బందుల్లో ఉన్నారని, అధికారంలో ప్రతి ఒక్కరూ వాటాను పొందినప్పుడే పరిస్థితులు మెరుగవుతాయని అన్నారు. గతంలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని, ఇప్పుడు ముస్లింలు అసలు శక్తి ఏమిటన్నది చూపించాలని ఒవైసీ పిలుపునిచ్చారు.