విద్వేష ప్రసంగాలపై విచారణను పర్యవేక్షించండి

ABN , First Publish Date - 2022-01-01T09:58:15+05:30 IST

విద్వేష ప్రసంగాలపై విచారణను పర్యవేక్షించండి

విద్వేష ప్రసంగాలపై విచారణను పర్యవేక్షించండి

సుప్రీంకోర్టులో ముస్లిం సంస్థ పిటిషన్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 31: వరుసగా సాగుతున్న విద్వేష పూరిత ప్రసంగాలపై జరుగుతున్న విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానమే స్వయంగా పర్యవేక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మహమ్మద్‌ ప్రవక్తను లక్ష్యంగా చేసుకుని ఆయనను కించపరిచేలా కొందరు నిరంతరం విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ముస్లింల విశ్వాసాలను దెబ్బతీయాలని చూస్తున్నారని, ఇలాంటి వారిని వదిలిపెట్టవద్దని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఉలామా-ఇ-హింద్‌ సంస్థ అధ్యక్షుడు మౌలానా సయీద్‌ మహమూద్‌ అసద్‌ మదానీ తరఫున అడ్వొకేట్‌ ఎం.ఆర్‌. షంషద్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విద్వేష పూరిత వ్యాఖ్యలకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో తీసుకున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. విద్వేష పూరిత వ్యాఖ్యలపై అందుతున్న అన్ని ఫిర్యాదులను పరిశీలించేందుకు ఒక స్వతంత్ర కమిటీని వేసేలా ఆదేశించాలని కోరారు.  

Updated Date - 2022-01-01T09:58:15+05:30 IST