బ్రెజిలియన్ 5 Cruise Shipsలలో 214 మందికి కొవిడ్

ABN , First Publish Date - 2022-01-05T13:02:51+05:30 IST

బ్రెజిలియన్ జిల్లాలోని ఐదు క్రూయిజ్ షిప్‌లలో 214 మందికి కొవిడ్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది...

బ్రెజిలియన్ 5 Cruise Shipsలలో 214 మందికి కొవిడ్

బ్రెజిలియా : బ్రెజిలియన్ జిల్లాలోని ఐదు క్రూయిజ్ షిప్‌లలో 214 మందికి కొవిడ్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. కరోనా రోగులు వెలుగుచూసిన రెండు విహార నౌకలు శాంటోస్ నౌకాశ్రయంలో నిర్బంధంలో ఉన్నాయని హెల్త్ రెగ్యులేటర్ అన్విసా చెప్పారు.స్విస్-ఇటాలియన్ క్రూయిజ్ లైన్ ఎంఎస్‌సీ నడుపుతున్న రెండు విహార నౌకల్లో 6వేల మంది కంటే ఎక్కువ ప్రయాణీకులతో రియో ​​డి జనీరో,శాంటోస్‌లకు ఈ వారం రాబోతున్నాయని రెగ్యులేటర్ తెలిపింది.గురువారం శాంటాస్‌కు చేరుకున్న ఎమ్మెస్సీ షిప్ లో 65 సిబ్బందికి,25మంది ప్రయాణీకులకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది.విహార నౌకల్లో కరోనా కేసులు వెలుగుచూడటంతో జనవరి 21వతేదీ వరకు బ్రెజిల్ దేశంలో క్రూయిజ్‌షిప్‌ల రాకపోకలను నిలిపివేశారు.


కార్నివాల్ కార్ప్ యాజమాన్యంలోని స్ప్లెండిడా, కోస్టా డయాడెమా విహార నౌకలను శాంటాస్‌లో నిర్బంధించారు. ఈ విహార నౌకలో 62మంది ప్రయాణికులు, 30 మంది సిబ్బందికి కరోనా వైరస్ సోకింది.కార్నివాల్ యాజమాన్యంలోని కోస్టా ఫాసినోసా విహారనౌక రియోలోని పోర్ట్‌లో నిలిపారు.ఈ నౌకలో ఐదుగురు ప్రయాణికులకు కరోనా వచ్చిందని అన్విసా వివరించారు.


Updated Date - 2022-01-05T13:02:51+05:30 IST