Amarnath Yatraకు 20వేల మంది భక్తుల రిజిస్ట్రేషన్

ABN , First Publish Date - 2022-04-28T13:16:07+05:30 IST

పవిత్ర అమర్‌నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేయించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది...

Amarnath Yatraకు 20వేల మంది భక్తుల రిజిస్ట్రేషన్

శ్రీనగర్: పవిత్ర అమర్‌నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేయించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. రెండేళ్ల కరోనా విరామం తర్వాత ఈ ఏడాది జూన్ 30వతేదీ నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నఅమర్‌నాథ్ యాత్ర జరగనుంది.రిజిస్ట్రేషన్ ప్రారంభమైనప్పటి నుంచి రెండు వారాల లోపు జమ్మూకశ్మీర్ బ్యాంక్ కౌంటర్ల ద్వారా వార్షిక అమర్‌నాథ్ యాత్ర కోసం 20,000 మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అమర్ నాథ్ తీర్థయాత్రకు పెరుగుతున్న ప్రతిస్పందనను సూచిస్తుందని ఒక అధికారి తెలిపారు. కేవలం 13 పని దినాల్లో దేశవ్యాప్తంగా 20,599 మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు జమ్మూకశ్మీర్ బ్యాంక్ ఎండీ బల్దేవ్ ప్రకాష్ తెలిపారు.


యాత్రకు పెరుగుతున్న స్పందనకు ఇది నిదర్శనమని అన్నారు.యాత్రా సమయంలో యాత్రికులకు ప్రాథమిక బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పించేందుకు రెండు ప్రత్యేక కౌంటర్లు, నాలుగు ఏటీఎంలు, రెండు మైక్రో ఏటీఎంలను యాత్ర మార్గంలో ఏర్పాటు చేసినట్లు ప్రకాష్ వివరించారు. 


Updated Date - 2022-04-28T13:16:07+05:30 IST