Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఐదుగురి ఉసురు తీసిన అతివేగం

 తీవ్ర గాయాలతో ముగ్గురి పరిస్థితి విషమం

 బొలేరో, ఆటో ఢీ.. 

 రెండు కుటుంబాల్లో విషాదం

 అనంతపురం జిల్లాలో

 ఘోర రోడ్డు ప్రమాదం 


రాయదుర్గం, డిసెంబరు 6: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుమ్మఘట్ట మండలం గోనబావి క్రాస్‌ వద్ద బొలేరో, ఆటో ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. బ్రహ్మసముద్రం మండలం వెస్ట్‌ కోడిపల్లి గ్రామానికి చెందిన శేఖరప్ప సోమవారం తన ఆటోలో కుటుంబ సమేతంగా కర్ణాటకలోని ఉలిగి దేవాలయంలో దర్శనం చేసుకుని  సొంతూరికి వెళుతున్నారు. మార్గమధ్యంలో పూలకుంట గ్రామం వద్ద ముప్పులకుంటకు చెందిన నాగమ్మ తన కూతురు లక్ష్మీదేవి, మనవడు మహేంద్రను తీసుకుని ఐదుకల్లు గ్రామంలో జరిగే ఆవుల జాతరకు వెళ్లేందుకు రోడ్డుపై నిల్చున్నారు. శేఖరప్ప ఆటో అటువైపు వెళుతుండటంతో వీరు కూడా అందులో ఎక్కా రు. ఆటో ఎక్కిన 15 నిమిషాలకే ప్రమా దం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో శేఖరప్ప (30), అతని కుమార్తె రష్మిత (6), నాగమ్మ (70), ఆమె మనవడు మహేంద్ర (10) అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు ఆటోలో ఉన్న శేఖరప్ప భార్య రూప, కుమారుడు రాము, మహేంద్ర తల్లి లక్ష్మీదేవి(35)తో పాటు బొలేరో వాహనాన్ని నడుపుతున్న వైసీపీ నాయకుడు గోనబావి ప్రతా్‌పరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, లక్ష్మీదేవి అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. కాగా, ప్రతాప్‌ రెడ్డి అతివేగంగా బొలేరోను నడుపుకుంటూ వచ్చి ఆటోను ఢీకొట్టినట్లు సమాచారం. ఆస్పత్రిలో క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement
Advertisement