వందే భార‌త్ మిష‌న్: స్వదేశానికి చేరిన సుమారు 10 లక్ష‌ల మంది ప్ర‌వాసులు

ABN , First Publish Date - 2020-08-11T16:19:10+05:30 IST

కోవిడ్ సంక్షోభం వ‌ల్ల విదేశాల్లో చిక్కుకున్న ప్ర‌వాస భార‌తీయుల‌ను 'వందే భార‌త్ మిష‌న్' ద్వారా స్వ‌దేశానికి త‌ర‌లిస్తున్న కేంద్రం ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 10 లక్ష‌ల మందిని భార‌త్‌కు తీసుకొచ్చిందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు.

వందే భార‌త్ మిష‌న్: స్వదేశానికి చేరిన సుమారు 10 లక్ష‌ల మంది ప్ర‌వాసులు

న్యూఢిల్లీ: కోవిడ్ సంక్షోభం వ‌ల్ల విదేశాల్లో చిక్కుకున్న ప్ర‌వాస భార‌తీయుల‌ను 'వందే భార‌త్ మిష‌న్' ద్వారా స్వ‌దేశానికి త‌ర‌లిస్తున్న కేంద్రం ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 10 లక్ష‌ల మందిని భార‌త్‌కు తీసుకొచ్చిందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. అలాగే స్వ‌దేశంలో ఇరుక్కుపోయిన‌‌ ల‌క్ష 30వేల మంది ప్ర‌వాసులు విదేశాల‌కు వెళ్లార‌ని తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేర‌కు న‌డుస్తున్న‌ ఈ మిషన్ వివిధ దేశాల్లో చిక్కుకున్న దేశ‌ పౌరులను స్వదేశానికి తిరిగి రప్పించ‌డానికి, అలాగే ప‌నుల మీద భార‌త్‌కు వ‌చ్చి ఇక్క‌డే ఇరుక్కుపోయిన వారు విదేశాల‌కు వెళ్ళడానికి వీలు కల్పిస్తుందని ఈ సంద‌ర్భంగా మంత్రి పేర్కొన్నారు. ప్ర‌స్తుతం కొనసాగుతున్న‌ ఐదో ద‌శ 'వందే భార‌త్ మిష‌న్' ద్వారా ఆదివారం 6వేల మంది, సోమ‌వారం 5,036 మంది భార‌త ప్ర‌వాసులు స్వ‌దేశానికి చేరుకున్నార‌ని పూరి తెలిపారు.



Updated Date - 2020-08-11T16:19:10+05:30 IST