UAE: యూఏఈలో 73 దేశాల వారికి 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం.. కానీ, భారతీయులకు మాత్రం..

ABN , First Publish Date - 2022-08-25T18:44:49+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(United Arab Emirates) వెళ్లే 73 దేశాల వారికి వీసా ఆన్ అరైవల్ (visa on arrival) సౌకర్యం ఉంది.

UAE: యూఏఈలో 73 దేశాల వారికి 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం.. కానీ, భారతీయులకు మాత్రం..

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(United Arab Emirates) వెళ్లే 73 దేశాల వారికి వీసా ఆన్ అరైవల్ (visa on arrival) సౌకర్యం ఉంది. అంటే.. ఈ 73 దేశాల పౌరులకు వారివారి దేశాల పాస్‌పోర్టులు ఉంటే చాలు.. యూఏఈలో దిగగానే ఆ దేశ విజిట్ వీసా పొందవచ్చు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) సమాచారం ప్రకారం ఈ 73 దేశాల వారికి 30 రోజుల నుంచి 180 రోజుల కాలపరిమితితో ఈ వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. అయితే, భారతీయ పౌరులకు ఈ వెసులుబాటు కేవలం 14 రోజులకే పరిమితం చేసింది. అలాగే మనోళ్లకు ఇతర షరతులను కూడా యూఏఈ అమలు చేస్తోంది.  


30 రోజుల వీసా ఆన్ అరైవల్ సౌకర్యం అందుబాటులో ఉన్న దేశాలివే..

20 దేశాల వారికి యూఏఈ 30 రోజుల వ్యవధితో వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కల్పిస్తోంది. ఈ దేశాలకు చెందిన పౌరులు ముందుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. యూఏఈలోని విమానాశ్రయాల్లో దిగిన తర్వాత అక్కడి ఇమ్మిగ్రేషన్ విభాగంలో కావాల్సిన వివరాలు ఇస్తే.. వెంటనే విజిట్ వీసా ఇచ్చేస్తారు. అది కూడా పూర్తి ఉచితంగా. ఈ సౌకర్యం అందుబాటులో ఉన్న దేశాల జాబితాను పరిశీలిస్తే.. 

1. Andorra

2. Australia

3. Brunei

4. Canada

5. China

6. Hong Kong, China

7. Japan

8. Kazakhstan

9. Macau, China

10. Malaysia

11. Mauritius

12. Monaco

13. New Zealand

14. Republic of Ireland

15. San Marino

16. Singapore

17. Ukraine

18. United Kingdom and Northern Ireland

19. United States of America

20. Vatican City




90 రోజుల వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉన్న దేశాలు ఎవంటే..

ఇక 90 రోజుల వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉన్న దేశాల సంఖ్య 53. ఈ దేశాలకు చెందిన వారికి యూఏఈ సర్కార్ మల్టీపుల్ ఎంట్రీతో పాటు 90 రోజుల కాలపరిమితితో విజిట్ వీసా ఇస్తోంది. ఆ దేశాల జాబితా ఇదే..

1. Argentina

2. Austria

3. Bahamas Islands

4. Barbados

5. Belgium

6. Brazil

7. Bulgaria

8. Chile

9. Colombia

10. Costa Rica

11. Croatia

12. Cyprus

13. Czech Republic

14. Denmark

15. El Salvador

16. Estonia

17. Finland

18. France

19. Germany

20. Greece

21. Honduras

22. Hungary

23. Iceland

24. Italy

25. Kiribati

26. Latvia

27. Liechtenstein

28. Lithuania

29. Luxembourg

30. Maldives

31. Malta

32. Montenegro

33. Nauru

34. Netherlands

35. Norway

36. Paraguay

37. Peru

38. Poland

39. Portugal

40. Romania

41. Russian Federation

42. Saint Vincent and the Grenadines

43. San Marino

44. Serbia

45. Seychelles

46. Slovakia

47. Slovenia

48. Solomon Islands

49. South Korea

50. Spain

51. Sweden

52. Switzerland

53. Uruguay


ఇక 180 రోజుల విజిట్ వీసా సౌకర్యం కేవలం మెక్సికన్ పాస్‌పోర్టు ఉన్నవారికి మాత్రమే ఉంది. ఆరు నెలల వ్యవధితో వచ్చే విజిట్ వీసాతో యూఏఈలో 180 రోజుల వరకు స్టే చేసే వెసులుబాటు ఉంటుంది. వీసా జారీ అయిన తేదీ నుంచి దీని గడువు మొదలవుతుందని ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. ఇక భారతీయులకు 14 రోజుల వీసా ఆన్ అరైవల్‌ సౌకర్యం ఉంది. దీనికి భారత పాస్‌పోర్టు ఉంటే సరిపోతుంది. మన పాస్‌పోర్టుతో పాటు అమెరికా విజిట్ వీసా లేదా యూఎస్ గ్రీన్‌కార్డు ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుంది. అలాగే యూకే రెసిడెన్సీ వీసా లేదా యూరోపియన్ యూనియన్ (EU) రెసిడెన్సీ వీసా ఉన్న భారతీయులకు ఈ వెసులుబాటు ఉంది.  

Updated Date - 2022-08-25T18:44:49+05:30 IST