Gulf దేశాల నుంచి వెనక్కి వచ్చేసిన 7లక్షలకు పైగా భారత ప్రవాసులు.. ఒక్క Kuwait నుంచే..

ABN , First Publish Date - 2021-12-13T14:17:43+05:30 IST

మహమ్మారి కరోనా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విలయం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడిప్పుడే కాస్తా సద్దుమణుగుతున్న సమయంలో ఒమైక్రాన్ రూపంలో మరోసారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇక కరోనా కారణంగా చాలా మంది పరిస్థితి దుర్భరంగా మారింది. ఉపాధి కోల్పోవడంతో ఆర్థికంగా చితికిపోయి ఎంతో మంది పడరానిపాట్లు పడుతున్నారు. ఉన్నచోట ఉపాధి కరువై వేరే దేశాలకు..

Gulf దేశాల నుంచి వెనక్కి వచ్చేసిన 7లక్షలకు పైగా భారత ప్రవాసులు.. ఒక్క Kuwait నుంచే..

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విలయం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడిప్పుడే కాస్తా సద్దుమణుగుతున్న సమయంలో ఒమైక్రాన్ రూపంలో మరోసారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇక కరోనా కారణంగా చాలా మంది పరిస్థితి దుర్భరంగా మారింది. ఉపాధి కోల్పోవడంతో ఆర్థికంగా చితికిపోయి ఎంతో మంది పడరానిపాట్లు పడుతున్నారు. ఉన్నచోట ఉపాధి కరువై వేరే దేశాలకు వెళ్లిన వలస జీవుల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. పరాయి దేశంలో చేస్తున్న ఉద్యోగం పోయి, స్వదేశానికి రాలేక వ్యధను అనుభవించారు. ఈ క్రమంలో ఇతర దేశాల్లో చిక్కుకున్న భారత ప్రవాసులను ఆదుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదిపింది. దీనిలో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలించేందుకు 'వందే భారత్ మిషన్' కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.


ఈ కార్యక్రమం ఇతర దేశాల్లో చిక్కుకున్న వారికి భారీ ఉపశమనం కలిగించింది. ఇక ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి కేంద్రం వందే భారత్ మిషన్ ద్వారా లక్షలాది మంది భారతీయులను స్వదేశానికి తరలించింది. అటు గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్(జీసీసీ) దేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రవాసులు స్వదేశానికి చేరుకున్నారు. తాజాగా లోక్ సభలో అడిగిన ప్రశ్నకు సమధానంగా గల్ఫ్ దేశాల నుంచి వెనక్కి వచ్చేసిన వలసదారుల వివరాలను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రాతపూర్వకంగా వెల్లడించారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం వందే భారత్ మిషన్ ద్వారా ఆరు జీసీసీ దేశాల నుంచి ఇప్పటివరకు 7లక్షలకు పైగా మంది ప్రవాసులు స్వదేశానికి తిరిగి రావడం జరిగింది. కరోనా వల్ల ఉపాధి కోల్పోయి ఇలా భారీ సంఖ్యలో ప్రవాసులు భారత్‌కు తిరిగి వచ్చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. 


ప్రభుత్వ గణాంకాల ప్రకారం వందే భారత్‌ మిషన్ ద్వారా ఆరు గల్ఫ్ దేశాల నుంచి 7,16,662 మంది కార్మికులను స్వదేశానికి తరలించడం జరిగిందని జై శంకర్ వెల్లడించారు. వీరిలో అత్యధికంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి 3,30,058 మంది ఇండియాకు తిరిగి వచ్చారు. ఆ తర్వాత వరుసగా సౌదీ అరేబియా(1,37,900), కువైత్(97,802), ఒమన్(72,259), ఖతార్(51,190), బహ్రెయిన్(27,453) నుంచి స్వదేశానికి చేరుకున్నారు. ఇంకా ఈ మిషన్ అలాగే కొనసాగుతున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే కరోనా విపత్కాలంలో గల్ఫ్ దేశాల్లోని భారత ప్రవాసుల యోగ క్షేమాలను తెలుసుకునేందుకు ఆయా దేశాల పరిపాలకులతో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నిసార్లు ఫోన్ ద్వారా సంభాషించారు దాని తాలూకు వివరాలను కూడా ఈ సందర్భంగా మంత్రి వెల్లడించడం జరిగింది. 


మహమ్మారి ప్రభావం మొదలైన 2020 మార్చి నుంచి ప్రధాని మోదీ ఈ ఫోన్ కన్వర్జేషన్లు చేశారు. అబుధాబి క్రౌన్ ప్రిన్స్‌తో (2020 మార్చి, మే, 2021 జనవరి); సౌదీ అరేబియా కింగ్‌తో(2020 సెప్టెంబర్‌లో రెండు సార్లు); ఖతార్ అమిర్‌తో(2020 మార్చి, మే, డిసెంబర్, 2021 ఏప్రిల్); ఒమన్ సుల్తాన్‌తో(2020 ఏప్రిల్, 2021 ఫిబ్రవరి); బహ్రెయిన్ కింగ్‌తో(ఏప్రిల్ 2020); కువైత్ అమిర్‌తో(ఏప్రిల్ 2020) ప్రధాని మోదీ ఫోన్ ద్వారా మాట్లాడి అక్కడి భారతీయుల బాగోగులను తెలుసుకున్నారని మంత్రి జై శంకర్ తెలియజేశారు.                   

Updated Date - 2021-12-13T14:17:43+05:30 IST