24 గంటల్లో 57 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు

ABN , First Publish Date - 2020-08-15T20:21:09+05:30 IST

కరోనా నుంచి ఒకే రోజలో అత్యధికంగా కోలుకున్న రికార్డును భారత్ నమోదు చేసింది. గత ..

24 గంటల్లో 57 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు

న్యూఢిల్లీ: కరోనా నుంచి ఒకే రోజలో అత్యధికంగా కోలుకున్న రికార్డును భారత్ నమోదు చేసింది. గత 24 గంటల్లో 57,381 మంది కరోనా నుంచి పూర్తి స్వస్థతతో డిశ్చార్జి అయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారంనాడు తెలిపింది. దీంతో భారత్ రికవరీ రేటు 70 శాతానికి పెరిగిందని పేర్కొంది.


'32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రికవరీ 50 శాతం దాటింది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ రికవరీ రేటును మించి ఉన్నాయి. మరింత మంది పేషెంట్లు కోలుకోవడం, ఆసుపత్రులు, హోం ఐసొలేషన్ నుంచి డిశ్చార్జి కావడంతో మొత్తంగా స్వస్థత చేకూరిన వరి సంఖ్య 18 లక్షలు దాటింది (18,08.936)' అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ప్రకటనలో పేర్కొంది. రికవరీ అయిన పేషెంట్లకు, యాక్టివ్ కేసులకు మధ్య గ్యాప్ 11 లక్షలకు పైనే (11,40,716) ఉందని తెలిపింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్ స్ట్రాటజీతో గత 24 గంటల్లో 8,68,679 వైద్య పరీక్షలు జరిపామని తెలిపింది. ప్రపంచ స్థాయి యావరేజ్‌తో పోల్చుకుంటే భారతదేశంలో కేస్ ఫ్యాటలిటీ రేటు (సీఎఫ్ఆర్) తక్కువగా ఉందని, ప్రస్తుతం అది 1.94 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ వివరించింది. టెస్టింగ్ ల్యాబ్ నెట్‌వర్క్ కూడా పటిష్టమైందని, ప్రస్తుతం దేశంలో 1,465 ల్యాబ్‌లు ఉండగా, ఇందులో 968 ప్రభుత్వ ల్యాబ్‌లు, 497 ప్రైవేటు ల్యాబ్‌లు ఉన్నాయని తెలిపింది.

Updated Date - 2020-08-15T20:21:09+05:30 IST