Abn logo
Sep 19 2021 @ 11:09AM

Kuwait లో భారీగా ప్రవాసుల అరెస్ట్.. గత వారం రోజుల్లో ఎంతమంది జైలుకు వెళ్లారంటే..

కువైత్ సిటీ: రెసిడెన్సీ ఉల్లంఘనదారులపై గల్ఫ్ దేశం కువైత్ ఉక్కుపాదం మోపుతోంది. వరుసగా తనిఖీలతో చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్న వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తోంది. ఇలా దేశవ్యాప్తంగా గడిచిన వారం రోజుల్లోనే ఏకంగా 500 మంది ప్రవాసులు అరెస్ట్ అయ్యారు. ఈ వారాంతంలో ఫార్వానియా, జహ్రా గవర్నరేట్ పరిధిలో జరిపిన సోదాల్లో 200 మందిని సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫార్వానియా పరిధిలోని జలీబ్ అల్ షుయౌఖ్, ఫార్వానియా, ఖైతాన్, ఇండస్ట్రియల్ అర్దియా, ఫ్రైడే మార్కెట్, రాయ్ ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఈ సెక్యూరిటీ తనిఖీల్లో సుమారు 200 మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీరందరూ చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో చాలామంది స్థానిక మార్కెట్స్‌లో డొమెస్టిక్ హెల్పర్స్‌గా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 


ఇవి కూడా చదవండి..

Kuwait కు వెళ్తున్నారా..? పొరపాటున కూడా వీటిని తీసుకెళ్లొద్దు..!

Kuwait లో ఎడమ చేతితో తినకూడదా..? ఆ దేశంలో ఉండగా ఏమేం చేయకూడదంటే..



ఇదే మాదిరి జహ్రా గవర్నరేట్ పరిధిలో జరిగిన తనిఖీల్లో 50 మందికి పైగా ఉల్లంఘనదారులను అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అలాగే బుధవారం రాత్రి హవల్లీలో పోలీసుల తనిఖీల్లో 118 మంది అరెస్ట్ అయ్యారు. అదే రోజు ఫహహీల్‌లో మరో 72 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రోజు బీనీద్ అల్ ఖర్‌లో 96 మంది, జబేర్ అల్ అహ్మద్‌లో 174 మందిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇలా గడిచిన వారం రోజుల్లోనే సుమారు 500 మంది రెసిడెన్సీ ఉల్లంఘనదారులను కువైత్ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా, అధికారిక సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న ఉల్లంఘనదారులను కువైత్ నుంచి బహిష్కరించేవరకు ఈ సెక్యూరిటీ సోదాలు జరుగుతాయని తెలుస్తోంది. ఇక ఈ తనిఖీల్లో అంతర్గత మంత్రిత్వశాఖ, మ్యాన్‌పవర్ అథారిటీ, ఎన్విరాన్‌మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొంటున్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...