Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాలిఫోర్నియాలోని టెస్లా ప్లాంట్‌లో కరోనా కలకలం..!

కాలిఫోర్నియా: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన కాలిఫోర్నియాలోని టెస్లా ప్లాంట్‌లో కరోనా కలకలం సృష్టించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతేడాది మే నుంచి డిసెంబర్ మధ్యలో కాలిఫోర్నియాలోని ఆటో తయారీ ప్లాంట్‌లో పనిచేసే ఉద్యోగుల్లో సుమారు 400 మందికి పైగా వైరస్ బారినపడ్డారని తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ బయటపెట్టింది. గతేడాది మహమ్మారి విజృంభణ సమయంలో రెండు నెలల పాటు మూతపడ్డ ఈ ప్లాంట్ ఆ తర్వాత కరోనా నిబంధనల మధ్య తిరిగి ప్రారంభమైంది. మార్చి మధ్యలోంచి మే నెల మధ్య వరకు సుమారు రెండు నెలల పాటు ఈ ఆటోతయారీ ప్లాంట్‌ను మూసి ఉంచారు. అనంతరం తెరచుకున్న ఈ ప్లాంట్‌లో ఉద్యోగులు వైరస్ బారిన పడ్డారు. అయితే, ఉత్పత్తి తగ్గిపోయి నష్టాలు వస్తాయనే కారణంతో కార్మికులు కొవిడ్ బారిన పడుతున్న విషయాన్ని దాచిపెట్టిన యాజమాన్యం యధావిధిగా పనులకు పిలిచింది. దీంతో 10వేల మంది పనిచేసే ఈ టెస్లా ప్లాంట్‌లో 440 మందికి వైరస్ సోకింది. తాజాగా ఈ డేటాను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ బయటపెట్టింది.  


Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement