రెండు ప్రత్యేక విమానాల్లో భారత్‌కు చేరిన 300 మంది ప్రవాసులు!

ABN , First Publish Date - 2020-07-06T15:58:31+05:30 IST

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా ఖతర్‌లో చిక్కుకున్న సుమారు 300 మంది భారతీయులు ఇండియాకు చేరుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. క

రెండు ప్రత్యేక విమానాల్లో భారత్‌కు చేరిన 300 మంది ప్రవాసులు!

దోహా: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా ఖతర్‌లో చిక్కుకున్న సుమారు 300 మంది భారతీయులు ఇండియాకు చేరుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహమ్మారిని కట్టడి చేయడానికి యావత్ ప్రపంచం మొత్తం స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయింది. భారత ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో లక్షలాదిమంది భారతీయులు విదేశాల్లో చిక్కుకున్నారు. అయితే లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన భారత ప్రభుత్వం.. విదేశాల్లో చిక్కుకున్న వారిని ఇండియాకు తరలించేందుకు ‘వందే భారత్ మిషన్’ప్రారంభించింది. ఇదే సమయంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ప్రవాసుల కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఖతర్‌లోని మహారాష్ట్ర మండల్, దోహాలోని ఇండియన్ కల్చరల్ సెంటర్‌లు రెండు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి, సుమారు 300 మందిని ఇండియాకు తరలించాయి. ఇందులో 172 మంది ప్రయాణికులతో కూడిన విమానం శుక్రవారం రోజు నాగ్‌పూర్‌లో ల్యాండ్ అవ్వగా.. 165 మందితో బయల్దేరిన విమానం శనివారం రోజు ముంబయిలో దిగింది. ఈ సందర్బంగా ఇండియన్ కల్చరల్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ వినోద్ నాయిర్ మాట్లాడుతూ.. ఈ 300 మంది ఇండియాకు తిరిగి రావడానికి ఒక్కొక్కరు సుమారు రూ.20వేలను చెల్లించినట్లు వెల్లడించారు. 


Updated Date - 2020-07-06T15:58:31+05:30 IST