18,000 కిలోమీటర్ల రైల్వే లైన్ విద్యుద్దీకరణ పూర్తి

ABN , First Publish Date - 2020-11-29T21:35:01+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి 2020 వరకూ 18,065 కిలోమీటర్లకు..

18,000 కిలోమీటర్ల రైల్వే లైన్ విద్యుద్దీకరణ పూర్తి

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి 2020 వరకూ 18,065 కిలోమీటర్లకు పైగా రైల్వై ట్రాక్ విద్యుద్దీకరణ జరిగినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఆదివారంనాడు తెలిపారు. ఆరేళ్ల క్రితంతో (2008-14) పోలిస్తే  రైల్వే ట్రాక్ విద్యుద్దీకరణ 371 శాతం పెరిగినట్టు ఒక ట్వీట్‌లో మంత్రి తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఇన్ఫోగ్రాఫిక్స్‌ను ఆయన వివరించారు. 2008-2014 మధ్య కేవలం 3,835 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ విద్యుద్దీకరణ జరిగినట్టు చెప్పారు. తమ ప్రభుత్వం 2019-2024 మధ్య 28,143 కిలోమీటర్ల మేర రైల్వే ట్రైక్ విద్యుద్దీకరణ యోచనలో ఉందని తెలిపారు. ఇందులో 2020 అక్టోబర్ నాటికి 5,642 కిలోమీటర్ల విద్యుద్దీకరణ పూర్తి చేసినట్టు వివరించారు.


కాగా, 2023 డిసెంబర్ నాటికి తమ బ్రాడ్‌గేజ్ నెట్‌వర్క్‌ను పూర్తిగా విద్యుద్దీకరించేందుకు భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే 66 శాతం బ్రాడ్ గేజ్ రూట్‌ను విద్యుద్దీకరించినట్టు పేర్కొంది.

Updated Date - 2020-11-29T21:35:01+05:30 IST