వందే భారత్ మిషన్: స్వదేశానికి చేరుకున్న 15 లక్షల మంది ప్రవాసులు

ABN , First Publish Date - 2020-09-25T17:35:42+05:30 IST

కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రం చేపట్టిన 'వందే భారత్ మిషన్'(వీబీఎం) కొనసాగుతోంది.

వందే భారత్ మిషన్: స్వదేశానికి చేరుకున్న 15 లక్షల మంది ప్రవాసులు

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రం చేపట్టిన 'వందే భారత్ మిషన్'(వీబీఎం) కొనసాగుతోంది. మే 7న ప్రారంభమైన వీబీఎం ఇప్పటికే ఐదు దశలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి ఆరో దశ మొదలైంది. అయితే, సెప్టెంబర్ 23 వరకు వీబీఎం ద్వారా మొత్తం 15.42 లక్షల మంది భారత ప్రవాసులు స్వదేశానికి చేరుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఆరో దశలో భాగంగా సెప్టెంబర్ 22 వరకు 24 దేశాల నుంచి మొత్తం 772 విమానాలు నడిపినట్లు పేర్కొన్నారు. ఈ విడతలో వివిధ దేశాల నుంచి లక్ష 24వేల మంది భారతీయులను స్వదేశానికి తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీవాస్తవ తెలిపారు. సెప్టెంబర్ 30 వరకు ఆరో దశ కొనసాగుతుందని చెప్పారు. 


ఇక ఆగస్టు 8 నుండి అందుబాటులోకి వచ్చిన 'ఎయిర్ సువిదా' డిజిటల్ ప్లాట్‌ఫాం 'వందే భారత్ మిషన్' విమానాలలో వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరికీ తప్పనిసరిగా సంస్థాగత నిర్బంధం నుంచి మినహాయింపు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా, తమ ఆర్‌టీ పీసీఆర్ పరీక్ష ఆధారంగా సంస్థాగత నిర్బంధం నుండి మినహాయింపు కోసం ప్రయాణికుల దీర్ఘకాల డిమాండ్‌ మేరకు ఎయిర్ సువిదా సేవను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఇక ఇప్పటికే పలు దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకున్న భారత్.. పొరుగు దేశం బంగ్లాదేశ్‌తో కూడా ఈ విషయమై చర్చలు జరుపుతుందని శ్రీవాస్తవ తెలిపారు.       

Updated Date - 2020-09-25T17:35:42+05:30 IST