వందే భారత్ మిషన్: స్వదేశానికి చేరిన 10లక్షల మంది భారతీయులు!

ABN , First Publish Date - 2020-08-13T04:29:04+05:30 IST

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన ‘వందే భారత్

వందే భారత్ మిషన్: స్వదేశానికి చేరిన 10లక్షల మంది భారతీయులు!

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన ‘వందే భారత్ మిషన్’ కొనసాగుతోంది. కాగా.. ఈ మిషన్‌లో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 10లక్షల మంది భారతీయులు.. స్వదేశానికి చేరుకున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ మిషన్‌లో భాగంగా పౌర విమానయాన, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపిన ఆయన.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులందరినీ స్వదేశానికి చేర్చే వరకు దీన్ని కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. కాగా.. ఈ మిషన్‌ను భారత ప్రభుత్వం మే 7 ప్రారంభించింది. ప్రస్తుతం ఐదో విడత ‘వందే భారత్ మిషన్’ కొనసాగుతోంది. 


Updated Date - 2020-08-13T04:29:04+05:30 IST