వందే భారత్ మిషన్: లబ్ధి పొందిన 10లక్షల మంది భారతీయులు!

ABN , First Publish Date - 2020-08-02T22:58:10+05:30 IST

భారత ప్రభుత్వం ప్రారంభించిన ‘వందే భారత్ మిషన్’వల్ల దాదాపు 10లక్షల మంది భారతీయులు లబ్ధి పొందినట్లు పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ పూరి ట్వి

వందే భారత్ మిషన్: లబ్ధి పొందిన 10లక్షల మంది భారతీయులు!

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ప్రారంభించిన ‘వందే భారత్ మిషన్’వల్ల ఇప్పటి వరకు దాదాపు 10లక్షల మంది భారతీయులు లబ్ధి పొందినట్లు పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ పూరి ట్విట్టర్ ద్వారా తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న దాదాపు 9లక్షల మంది భారతీయులు.. ‘వందే భారత్ మిషన్‌’లో భాగంగా ఇండియాకు చేరుకున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో భారత్‌లో చిక్కుకున్న సుమారు 1.16 లక్షల మంది ప్రవాసులు విదేశాలకు వెళ్లినట్లు వివరించారు. ఐదవ విడత ‘వందే భారత్ మిషన్’ నిన్నటి నుంచి ప్రారంభమైనట్లు తెలిపిన ఆయన.. ఈ మిషన్‌లో భాగంగా నిన్న 3,124 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు స్పష్టం చేశారు. ఐదో విడత ‘వందే భారత్ మిషన్’ ద్వారా మరికొంత మంది లబ్ధి పొందనున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం మే 7న ‘వందే భారత్ మిషన్’ను ప్రారంభించింది. 


Updated Date - 2020-08-02T22:58:10+05:30 IST