ఆ ఒక్క కారణంతో.. అమెరికాలో ఏకంగా లక్ష మంది మృతి..!

ABN , First Publish Date - 2021-11-19T03:00:00+05:30 IST

అమెరికాలో నిషేధిత ఔషధాల వినియోగం హద్దులు దాటిపోయి సమాజంపై తీవ్ర దుష్ఫరిణామాలు చూపిస్తోంది. ప్రభుత్వం తాజా లెక్కల ప్రకారం.. ఈ డ్రగ్స్‌ను అధిక మోతాదుల్లో వినియోగించిన కారణంగా గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు వరకూ ఏకంగా లక్ష మంది మరణించారు.

ఆ ఒక్క కారణంతో.. అమెరికాలో ఏకంగా లక్ష మంది మృతి..!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో నిషేధిత ఫార్మా పదార్థాల వినియోగం హద్దులు దాటిపోయి సమాజంపై తీవ్ర దుష్ఫరిణామాలు చూపిస్తోంది. ప్రభుత్వం తాజా లెక్కల ప్రకారం.. ఈ డ్రగ్స్‌ను అధిక మోతాదుల్లో వినియోగించిన కారణంగా గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు వరకూ ఏకంగా లక్ష మంది మరణించారు. ఈ గణాంకాలు అమెరికాలో సంచలనం కలిగిస్తున్నాయి. దేశంలో ఇంతకుముందెన్నడూ ఈ స్థాయిలో ప్రజలు డ్రగ్స్‌ అపరిమిత వినియోగానికి బలికావడం చూడలేదని అక్కడి వైద్య వర్గాలు చెబుతున్నాయి. మునుపటితో పోలిస్తే..ఈ మారు మరణాల సంఖ్య 30 శాతం పెరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మరణాల్లో అధిక శాతం ఫెంటైనైల్ అనే నిషేధిత ఓపియాయిడ్ డ్రగ్ కారణంగానే సంభవించాయని తెలుస్తోంది. దీనికి తోడు కరోనా కారణంగా అనేక మంది ప్రామాణిక వైద్యసదుపాయాలకు దూరమయ్యారని, ఇటువంటి వారు ఈ డ్రగ్స్‌కు బలయ్యారని అక్కడి వర్గాలు చెబుతున్నాయి.




మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ పరిణామం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇదో విచారకరమైన మైలురాయి’’ అని వ్యాఖ్యానించారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వానికి బిలియన్ డాలర్లలో నిధులు కావాలని అమెరికా చట్టసభల సభ్యులను బైడెన్ రారు. ఈ దిశగా నిధులు కేటాయించాలని విన్నవించారు. ఫెంటైనైల్ తయారీకి అవసరమైన ముడిసరకు చైనా నుంచి మెక్సికోకు దిగుమతి అవుతున్నాయి. అక్కడి మాదకద్రవ్యాల ముఠాలు  ఈ ముడిసరుకుతో ఫెంటైనైల్ తయారు చేసి.. అమెరికాకు తరలిస్తున్నాయి. 


Updated Date - 2021-11-19T03:00:00+05:30 IST