వెల్లివిరిసిన జాతీయ స్ఫూర్తి

ABN , First Publish Date - 2022-08-14T07:45:11+05:30 IST

అజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా ఎర్రగొండపాలెంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు త్రివర్ణపతాకంతో ర్యాలీ నిర్వహించారు.

వెల్లివిరిసిన జాతీయ స్ఫూర్తి
ఎర్రగొండపాలెంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల ర్యాలీ

వాడవాడలా జాతీయ జెండాలతో ర్యాలీలు   

 పలుగ్రామాల్లో జాతీయ  జెండాల పంపిణీ  

ఎర్రగొండపాలెం, ఆగస్టు 13 : అజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా ఎర్రగొండపాలెంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు త్రివర్ణపతాకంతో ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ ఉన్న పాఠశాలలో ఎన్‌ఎస్‌ ఎస్‌ విద్యార్థులు త్రివర్ణపతాకం చేతబట్టి చేసిన విన్యాసాలు పట్టణ ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీడీవో సాయికుమార్‌, ఎంఈవో ఆంజనేయులు, ఎస్‌ .ఐజి కోటయ్య, హెచ్‌ఎం శామ్యూల్‌ జాన్‌, సర్పంచి ఆర్‌ అరుణాబాయ్‌, పంచాయతీ కార్యదర్శి రాజశేఖరరెడ్డి, ఎన్‌ ఎస్‌ఎస్‌ కోఆర్డినేటరు కె సత్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. 

అమానిగుడిపాడు, అయ్యంబొట్లపల్లి గ్రామాల్లో పాఠశాల విద్యార్ధులు ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ ర్యాలీ నిర్వహించారు. హెచ్‌ఎం భాస్కర్‌, బీజేపీ నాయకులు వై ఈశ్వర్‌, పి.నాగేశ్వరరావు, ఎం.సూర్యనారాయణ, డి.బాదరయ్యగౌడ్‌ పాల్గొన్నారు. 

ఎర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపాలెం పునరావాసకాలనీలో హర్‌ఘర్‌కా తిరంగా కార్యక్రమంలో భాగంగా శనివారం జెల్లా గురవయ్య 75 ఏళ్ల వయస్సులో జాతీయజెండాను చేతపట్టి దేశభక్తిని చాటుకున్నారు.

పెద్ద దోర్నాల : అజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా స్థానిక బీఎం డిగ్రీ కళాశాల, వసంత జూనియర్‌ కళాశాల విద్యార్థులు జాతీయ పతాకంతో శనివారం ప్రదర్శన నిర్వహించారు. 200 అడుగుల పొడవైన జాతీయ పతాకంతో విద్యార్థులు పట్టణంలో ప్రదర్శనతో దేశభక్తి గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ బట్టు రమణారెడ్డి ప్రిన్సిపాల్‌ బెంజిమెన్‌, షేక్‌ భాషా, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

బేస్తవారపేట : ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎంపీపీ వేగినాటి ఓసూరారెడ్డి అన్నారు. జాతీయ జెండాలతో బేస్తవారపేటలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి గ్రామానికి సరిపడా జెండాలను మండల పరిషత్‌ నుంచి వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నా మన్నారు. కార్యాక్రమంలో ఎంపీడీవో చెన్నకేశవరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు బండ్లమూడి వెంకటరాజయ్య, శర్మ, రఘు, మల్లేల శేఖర్‌రెడ్డి, వెన్నా బాస్కర్‌రెడ్డి, కరిమూల్లా, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

బేస్తవారపేట(కంభం) : కంభం లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు సయ్యద్‌ జాకీర్‌ హుస్సైన్‌  ఆధ్యక్షతన శనివారం ఘర్‌ ఘర్‌ కా తిరంగా హర్‌ ఘర్‌కా తిరంగా కార్యక్రమాన్ని కందులాపురం బీసీ కాలనీలో నిర్వహించారు.మంచాల బ్రహ్మేశ్వరరావు ఆర్థిక సహాయంతో గురకుల పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి జాతీయ జెండాలనను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో  క్లబ్‌ మాజీ అధ్యక్షులు పులి.శ్రీనివాసప్రసాద్‌, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ పి.చాముండేశ్వరీ,పి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

పొదిలి రూరల్‌ : జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సీహెచ్‌ తారావాణి ఆధ్వర్యంలో శనివారం కళాశాల ప్రాంగణం నుంచి  ఆర్టీసీ బస్టాండ్‌ వరకు విద్యార్థులు, అధ్యాపకులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.అనంతరం దేశంకోసం ప్రాణాలర్పించిన నాయకులందరికీ, నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు షేక్‌నాభీ, కెజియా, ప్రమీలారాణి, వెంకటేశ్వర్లు, సుజాత శాంతిప్రియా, రమణారెడ్డి,   విద్యార్థులు పాల్గొన్నారు. అదే విధంగా పొదిలి ఆర్టీసీ డీఎం సుదరరావు ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ కార్యక్రమం డిపో ఆవరణలో నిర్వహించారు.  బస్టాండ్‌ ఆవరణలో మూడురోజులు స్వాతంత్ర దినోత్స కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. 

మార్కాపురం(వన్‌టౌన్‌) : ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం మార్కాపురంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ సాయిబాలాజీ ఉన్నత పాఠశాల విద్యార్థులు 250 అడుగుల భారీ జెండాతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కరస్పాండెంట్‌ పి.ప్రకాష్‌రావు, ప్రిన్సిపల్‌ సయ్యద్‌ మస్తాన్‌ వలి పాల్గొన్నారు. స్థానిక సెయింట్‌ ఆన్స్‌ పాఠశాల విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు సిస్టర్‌ అఖిలా ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహిం చారు. స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణ నృత్యాలు, వివిధ దేశభక్తి గీతాలు ఆలపించారు. ప్రజా రవాణాశాఖ ఏపీఎస్‌ ఆర్టీసీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ డిపోలో అమృత్‌ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. రెడ్డి మహిళా కళాశా లలో ర్యాలీని మాజీ ఎమ్మెల్యే జెంకె వెంకటరెడ్డి ప్రారంభిం చారు. స్థానిక నెహ్రూ బజార్‌లోని షిరిడీ సాయి మందిరం నుంచి సుమారు 700 మందితో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మందిర అధ్యక్ష, కార్యదర్శులు సత్యనారాయణ, గోపాలుని హరిహరరావు తదితరులు పాల్గొన్నారు.

రాచర్ల : ఆజాదీకా అమృత మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా సామాజిక కార్యకర్త శంకర్‌నాయుడు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. దాదాపు 200 మందికి పంపిణీ చేశారు.

గిద్దలూరు : పట్టణంలోని విజయకోఆపరేటివ్‌ జూనియర్‌ కళాశాల ఆవరణలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. కార్యక్రంమలో నెహ్రూ యువకేంద్ర వలంటీర్‌ వెంకటవినీత్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లు, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ నాయక్‌, వివిధ సంస్థల ప్రతినిధులు ఖాజాహుస్సేన్‌, అబ్దుల్‌రెహమాన్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-14T07:45:11+05:30 IST