HYD: ఆగివున్న లారీనీ ఢీకొట్టిన కారు..చెలరేగిన మంటలు

ABN , First Publish Date - 2021-12-04T13:34:47+05:30 IST

పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా కారులో నుంచి మంటలు చెలరేగాయి. అటుగా

HYD: ఆగివున్న లారీనీ ఢీకొట్టిన కారు..చెలరేగిన మంటలు

హైదరాబాద్: పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా కారులో నుంచి మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న వాహనదారుడు కారులో మంటలను చూసి డ్రైవర్‎ను బయటికి తీశాడు. అనంతరం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ప్రమాద స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్‎కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.

Updated Date - 2021-12-04T13:34:47+05:30 IST