ఢిల్లీలో 386 మంది కరోనా బాధితులు.. అందులో 259 మంది అక్కడివారే!

ABN , First Publish Date - 2020-04-04T21:23:24+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 386కు చేరుకున్నాయి.

ఢిల్లీలో 386 మంది కరోనా బాధితులు.. అందులో 259 మంది అక్కడివారే!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 386కు పెరిగింది. వీటిలో 259 కేసులు నిజాముద్దీన్ మర్కజ్ మసీదుకు సంబంధించినవేనని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు. అలాగే, మర్కజ్ మసీదులో జరిగిన కార్యక్రమంతో సంబంధం ఉన్న 600 మందిని క్వారంటైన్‌కు తరలించినట్టు తెలిపారు. మరోవైపు దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,902కు పెరిగింది. 183 మంది బాధితులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 68 మంది మృతి చెందారు.


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దినసరి కూలీలకు ప్రభుత్వం ఆహారాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. అలాగే, తమ పొరుగువారు ఎవరూ ఆకలితో అలమటించకుండా చూడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో, సామాజిక దూరం ఎందుకు పాటించాలో అర్థమయ్యేలా తల్లిదండ్రులు తమ పిల్లలకు వివరించి చెప్పాలని కేజ్రీవాల్ సూచించారు.

Updated Date - 2020-04-04T21:23:24+05:30 IST