పది ఫలితాల్లో బాలికలదేపై చేయి

ABN , First Publish Date - 2022-07-01T04:09:59+05:30 IST

ప్రభుత్వం గురువారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. పదవతరగతి ఫలితాల్లో జిల్లా 32వ స్థానంలో నిలిచింది.

పది ఫలితాల్లో బాలికలదేపై చేయి

- 79.99 ఉత్తీర్ణత శాతంతో 32వ స్థానం

ఆసిఫాబాద్‌, జూన్‌ 30: ప్రభుత్వం గురువారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. పదవతరగతి ఫలితాల్లో జిల్లా 32వ స్థానంలో నిలిచింది. జిల్లాలో విద్యార్థులు 79.99 శాతంతో రాష్ట్రంలో ఈ స్థానాన్ని సాధించారు. పదవ తరగతి పరీక్షల్లో జిల్లా నుంచి మొత్తం 7007 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా ఇందులో 3367 మంది బాలురు, 3640మంది బాలికలు ఉన్నారు. ఇందులో 2582 మంది బాలురు, 3023 మంది బాలిక లు మొత్తం 5065 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో బాలురు 76.69 శాతం ఉత్తీర్ణులు కాగా బాలికలు 83.05 శాతం ఉత్తీర్ణులై పై చేయి సాధిం చారు. జిల్లాలో మొత్తం 7పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించారు. దహెగాం మండలం చిన్న రాస్పెల్లి జడ్పీ ఉన్నతపాఠశాలలో సయ్యద్‌ కరీష్మా 9.8 జీపీఏ, సిర్పూర్‌(యూ) ఆదర్శ పాఠశాలలో మోనశ్రీ 9.8 జీపీఏ, ఆసిఫాబాద్‌ ఆదర్శ పాఠశాలలో దెబ్బటి సిద్దార్థ 9.8 జీపీఏ మార్కులను సాధించారు. ఈ ఫలితాల్లో కస్తూర్బా పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాలో 15 కేజీబీవీలు ఉండగా 486మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 426మంది ఉత్తీర్ణ త సాధించారు. ఇందులో జైనూరు, సిర్పూర్‌ (యూ), పెంచికలపేట, బెజ్జూరు, కెరమెరి (మోడి) కేజీబీవీల లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించి సత్తాచాటారు. 

పెంచికలపేట: మండలంలోని కేజీబీవీకి చెందిన విద్యార్థిని మాడిశెట్టి వెన్నెల 9.7జీపీఏ మార్కులు సాధించి జిల్లా టాపర్‌లో రెండో స్థానంలో నిలిచింది. 

దహెగాం: మండలంలో 317మంది పరీక్షలు రాయగా 234 మంది ఉత్తీర్ణలయ్యారు. చిన్నరాస్పెల్లి జడ్పీఎస్‌ఎస్‌ విద్యార్థిని సయ్యద్‌ కరీష్మా 9.8 జీపీఏ మార్కులు సాదించి మండల టాపర్‌గా నిలిచింది.

కాగజ్‌నగర్‌లో ప్రైవేటు పాఠశాలలదే హవా

కాగజ్‌నగర్‌: ప్రభుత్వం గురువారం విడుదల చేసి న పదిఫలితాల్లో కాగజ్‌నగర్‌లోని ప్రైవేట్‌ పాఠశాల హవా కొనసాగింది. పట్టణానికి చెందిన కృష్ణవేణి పాఠశాలలో చదువుతున్న పి రాజేశ్వరి, టి ఆలేఖ్య, ఎం శ్రీ ప్రియ, జె రినీత్‌ 10జీపీఏ సాధించినట్టు కరస్పాండెంట్‌ దోమల సురవర్ధన్‌ తెలిపారు. అలాగే శ్రీ విశ్వశాంతి హైస్కూల్‌లో ముగ్గురు విద్యార్థులు బి పవిత్ర, ఎన్‌ నీరజ, వికాస్‌వర్మ 10 జీపీఏ మార్కులు సాధించినట్టు కరస్పాండెంట్‌ ప్రసాద్‌ తెలిపారు. 56 మంది పది పరీక్షలు రాయగా 56మంది ఉత్తీర్ణత సాఽధించి వందశాతం పాస్‌ అయినట్టు పేర్కొన్నారు. ఫాతిమా కాన్వెంటులో దాసరి సిరిసహస్ర, బంక ప్రవళిక, హర్షిత, గుప్తా, సాయిని రజిత 10 జీపీఎ సాధించినట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ సందర్భంగా 10జీపీఎ మార్కులు రావడంతో వివిధ పాఠశాలలో సంబరాలు జరుపుకున్నారు.

రెబ్బెనలో 86శాతం ఉత్తీర్ణత 

రెబ్బెన : పది ఫలితాల్లో మండలంలో 86శాత ఉత్తీ ర్ణత సాధించినట్టు ఎంఈవో వెంకటేశ్వర స్వామి తెలిపారు. 492మంది విద్యార్థులు రాయగా 421 మంది ఉత్తీర్ణత సాధించినట్టు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి శ్రుతికి 9.8జీపీఏ వచ్చినట్టు ఆయన తెలిపారు.

వాంకిడిలో 83శాతం ఉత్తీర్ణత 

వాంకిడి: మండలంలో పదవతరగతిలో 83శాతం ఉత్తీర్ణత సాధించారు. మండలంలోని వాంకిడి ప్రభుత్వ ఉన్నతపాఠశాల విద్యార్థిని సలోని 9.5జీపీఏ సాధించి మండల టాపర్‌గా నిలిచింది. విద్యార్థినిని హెచ్‌ఎం జగదీష్‌, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు అభింనందించారు.

Updated Date - 2022-07-01T04:09:59+05:30 IST