మాదీ చింతమడకనే..మమ్మల్నీ గుర్తించండి

ABN , First Publish Date - 2021-06-20T05:22:31+05:30 IST

‘మాదీ చింతమడక గ్రామమే.. మమ్మల్ని గుర్తించడం లేదు సీఎం సారూ..’’ అంటూ గ్రామం నుంచి వలస వెళ్లిన వారు మొరపెట్టుకున్నారు.

మాదీ చింతమడకనే..మమ్మల్నీ గుర్తించండి

వలసవెళ్లిన కుటుంబాల అభ్యర్థన


సిద్దిపేటరూరల్‌, జూన్‌ 19 : ‘‘మాదీ చింతమడక గ్రామమే.. మమ్మల్ని గుర్తించడం లేదు సీఎం సారూ..’’ అంటూ గ్రామం నుంచి వలస వెళ్లిన వారు మొరపెట్టుకున్నారు. శనివారం వారు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. కేసీఆర్‌ స్వగ్రామం సిద్దిపేట రూరల్‌ మండలం చింతమడక గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలసవెళ్లాయి. అయితే చింతమడక గ్రామస్థులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక నిధుల ద్వారా ప్రకటించిన స్వయం ఉపాధి పథకం తమకు వర్తించడం లేదని వలస వెళ్లిన కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ గ్రామానికి ప్రకటించిన సంక్షేమ పథకాల్లో తమను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని బహిరంగసభలోనే సీఎం వెల్లడించినప్పటికీ, స్థానిక పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఆదివారం జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తమ సమస్యలను వివరిస్తామని వెల్లడించారు. 

Updated Date - 2021-06-20T05:22:31+05:30 IST