మన రక్తం ఎర్రగా ఉన్నా, పైకి కనిపించే నరాలు నీలిరంగులో ఎందుకుంటాయి? దీని గురించి సైన్స్ ఏమి చెబుతోందంటే..

ABN , First Publish Date - 2022-01-08T17:44:06+05:30 IST

మన శరీరంలో బయటకు కనిపించే నరాలు..

మన రక్తం ఎర్రగా ఉన్నా, పైకి కనిపించే నరాలు నీలిరంగులో ఎందుకుంటాయి? దీని గురించి సైన్స్ ఏమి చెబుతోందంటే..

మన శరీరంలో బయటకు కనిపించే నరాలు నీలి రంగులో ఉండటాన్ని మనం చూసే ఉంటాం. ఇది వృద్ధులలో స్పష్టంగా కనిపిస్తుంది. శరీరంలోని రక్తం ఎరుపురంగులో ఉన్నా నరాలు నీలి రంగులో ఎందుకు కనిపిస్తాయో మీకు తెలుసా? నరాలు నీలి రంగులో ఉండవని సైన్స్ స్పష్టం చేస్తున్నా, మనకు నీలిరంగులోనే ఎందుకు కనిపిస్తాయి? దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నరాలు నీలంగా కనిపించడానికి కారణం ఆప్టికల్ ఇల్యూజన్. అంటే భ్రమ అని అర్థం. 


ఇలా కనిపించడానికి కాంతి కిరణాలే కారణం. సాధారణంగా కాంతిలో సప్త వర్ణాలు ఉంటాయి. దీనిలో ఏరంగు ఏ వస్తువుపై ప్రతిఫలిస్తుందో, ఆ రంగులో ఆ వస్తువు కనిపిస్తుంది. ఉదాహరణకు ఒక వస్తువుపై ఈ ఏడు కాంతి కిరణాలు పరావర్తనం చెందితే అది మనకు తెలుపు రంగులో కనిపిస్తుంది. అదే సమయంలో ఈ కిరణాలన్నీ అవశోషణం చెందితే ఆ వస్తువు నల్లగా కనిపిస్తుంది. కిరణాల పరావర్తన సిద్దాంతం ఈ నరాల విషయంలో కూడా వర్తిస్తుంది. ఎరుపు రంగులో ఉన్న రక్తం నరాలలో ప్రవహిస్తుంటుంది. దీని ప్రకారం చూస్తే నరాలు అది ఎరుపు రంగులో కనిపించాలి. అయితే సైన్స్ ప్రకారం కాంతి కిరణాలలో ఏడు రంగులు ఉంటాయి. కాంతి కిరణాలు నరాలపై పడినప్పుడు, ఎరుపు రంగు కిరణాలు అవశోషితం అవుతాయి, అంటే అబ్జార్బ్ అవుతాయి. అయితే కిరణాలలో ఉన్న నీలం రంగు అవశోషితం కాదు. అది పరావర్తనం చెందుతుంది. ఫలితంగా మనిషిలో బయటకు కనిపించే నరాలు నీలి రంగులో కనిపిస్తాయి. ఉదాహరణకు, సముద్రపు నీటి రంగు పారదర్శకంగా ఉంటుంది, కానీ దూరం నుండి చూస్తే, అది నీలి రంగులో కనిపిస్తుంది. పగటిపూట సూర్యకిరణాలు నీటిపై పడినప్పుడు.. కాంతి నుండి వెలువడే ఇతర రంగుల కిరణాలు పరావర్తనం చెందుతాయి. నీలిరంగు కిరణాలు అవశోషితం అవుతాయి. ఫలితంగా సముద్రం నీలి రంగులో కనిపిస్తుంది. కానీ వాస్తవానికి సముద్రంలోని నీరు నీలి రంగులో ఉండదు. కాగా రక్తంలో హిమోగ్లోబిన్ ఉండటం వల్ల అది ఎరుపు రంగులో ఉంటుంది. హిమోగ్లోబిన్ అనేది ఐరన్, ప్రొటీన్‌లతో రూపొందిన ఒక ప్రత్యేకమైన ప్రోటీన్. కొన్ని జీవులలో రక్తపు రంగు కూడా నీలం లేదా ఆకుపచ్చగా ఉంటుంది. ఉదాహరణకు, ఆక్టోపస్‌లలో రక్తపు రంగు నీలి రంగులో ఉంటుంది. ఎందుకంటే హిమోసైనిన్ ప్రోటీన్ దాని రక్తంలో ఉంటుంది. ఇది నీలి రంగులో ఉంటుంది. అందుకే దాని రక్తం కూడా నీలి రంగులో ఉంటుంది.

Updated Date - 2022-01-08T17:44:06+05:30 IST