మన పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి

ABN , First Publish Date - 2021-01-27T04:58:12+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కలెక్టర్‌ పీజే.పాటిల్‌ అన్నారు. మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నల్లగొండ పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయపతాకం ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ సారధ్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయన్నారు.

మన పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి
పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరిస్తున్న కలెక్టర్‌ పీజే.పాటిల్‌

ఏడాదికి రైతు బంధు సాయం రూ.1200కోట్లు

533 చెరువుల్లో 4.71కోట్ల చేపపిల్లలు వదిలాం

గణతంత్ర దినోత్సవంలో నల్లగొండ జిల్లా కలెక్టర్‌ పీజే.పాటిల్‌

నల్లగొండ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కలెక్టర్‌ పీజే.పాటిల్‌ అన్నారు. మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నల్లగొండ పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయపతాకం ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ సారధ్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయన్నారు. రైతుబంధు కింద ఈ ఏడాది జిల్లాలో 4.40లక్షల మంది ఖాతాలో రూ.1200కోట్లు జమ చేశామన్నారు. రైతు బీమా ద్వారా ఇప్పటి వరకు 410మందికి రూ.20.50 కోట్లు ఇచ్చామన్నారు. జిల్లాలోని 533 చెరువుల్లో వంద శాతం రాయితీతో 4.71కోట్ల చేప పిల్లలు వదిలామని, 28 కొత్త చేపల చెరువుల నిర్మాణానికి రూ.1.48లక్షల చొప్పున సహాయ నిధి ఇచ్చామని తెలిపారు. మిషన్‌ భగీరథలో భాగంగా సాగర్‌ టెయిల్‌పాండ్‌, ఉదయసముద్రం, అక్కంపల్లి జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా రూ.2,226కోట్ల అంచనా వ్యయంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు కొత్తగా 1555 ఓహెచ్‌ఎ్‌సఆర్‌ల నిర్మాణం పూర్తయిందని, 3.50లక్షల కుటుంబాలకు నళ్లా కనెక్షన్లు ఇచ్చి శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లాలోని నాలుగు జలశుద్ధి కేంద్రాల నిర్మాణం పూర్తయిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.223కోట్లు ఖర్చు చేసి 3.78లక్షల మంది కూలీలకు ఉపాధి కల్పించామని, హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతీ పంచాయతీకి ఒక నర్సరీ చొప్పున 844 నర్సరీల్లో 86లక్షల మొక్కలు పెంచుతున్నామని వివరించారు. ఆరో విడత హరిత హారంలో భాగంగా ఇప్పటి వరకు 73లక్షల మొక్కలు నాటామని, 24లక్షల మొక్కలు ఇంటింటికీ పంపిణీ చేశామన్నారు. గ్రామల్లో పట్టణస్థాయి మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో దేవరకొండ, కొండమల్లేపల్లి మండలాలను రూర్బన్‌ పథకం కింద ఎంపిక చేసి రూ.15కోట్లతో 494 పనులు మంజూరు చేసి రూ.5కోట్లు ఖర్చు చేశామన్నారు.  ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానంతో పోలీ్‌సశాఖ ముందుకు వెళ్తోందని, మహిళల రక్షణకు జిల్లాలో మూడు షీటీంలు పనిచేస్తున్నాయన్నారు.

Updated Date - 2021-01-27T04:58:12+05:30 IST