Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 15 May 2022 03:29:43 IST

మా పార్టీకీ స్థలాలివ్వాలి: తమ్మినేని

twitter-iconwatsapp-iconfb-icon

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌కు కేటాయించినట్లుగానే తమ పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి కూడా స్థలాలు కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం లేఖ రాశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కార్యాలయాల నిర్మాణం కోసం జిల్లా కేంద్రాల్లో ఎకరం వరకు స్థలం కేటాయించాలని 2018 ఆగస్టు 18న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తుచేశారు. దీంతో పలు జిల్లాల్లో తమ పార్టీకి స్థలాలను కేటాయించాలని అర్జీలు పెట్టుకున్నామని, కానీ నేటికీ సీపీఎంతో పాటు ఇతర పార్టీలకు కూడా స్థలాలు ఇవ్వలేదన్నారు. దీనిని 2019 జూన్‌ 24న సీఎం కేసీఆర్‌, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి.. 2020 ఆగస్టు 24న మరోసారి ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయినా ఇప్పటిదాకా స్థలాల కేటాయింపు జరగలేదని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు అన్ని జిల్లాల్లో రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కేటాయించారని, దీనిని బట్టి ఈ జీవో కేవలం అధికార పార్టీ కోసమే తెచ్చినట్లు కనిపిస్తోందని తమ్మినేని విమర్శించారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తెలంగాణ Latest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.