మన ఊరు.. మనబడి దేశానికే ఆదర్శం కావాలి

ABN , First Publish Date - 2022-06-26T05:57:41+05:30 IST

రాష్ట్రంలో చేపట్టిన మన ఊరు...మనబడి కార్య క్రమం దేశానికే ఆదర్శం కావాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అ న్నారు.

మన ఊరు.. మనబడి దేశానికే ఆదర్శం కావాలి
కల్యాణలక్ష్మి చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

రాయికల్‌, జూన్‌ 25: రాష్ట్రంలో చేపట్టిన మన ఊరు...మనబడి కార్య క్రమం దేశానికే ఆదర్శం కావాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అ న్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అయోధ్యలో రూ. 40 లక్షలు, కుమ్మరిపెల్లిలో రూ.17.52లక్షలు, భూపతిపూర్‌లోరూ.31.74 లక్ష లు, కొత్తపేటలో రూ.15.25లక్షలతో పాఠశాలల్లో మౌలిక వసతుల అభి వృద్ధి పనులకు శనివారం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ విద్యారంగానికి పెద్దపీట వేయాలనే ఉద్ధేశ్యంతో ప్రభు త్వం మన ఊరు మనబడి కార్యక్రమం చేపట్టిందన్నారు. రాయికల్‌ మం డలానికి రూ.3కోట్ల 60లక్షలకు పైగా నిధులు కేటాయించామని అన్నారు. 

ఫపేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరం లాంటిదని ఎమ్మె ల్యే అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 14మంది అడబి డ్డలకు కల్యాణలక్ష్మి చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. 4వ వార్డులో దళితబంధు ద్వారా మంజూరైన సెంట్రింగ్‌ యూనిట్‌, ఒడ్డెలిం గాపూర్‌ గ్రామంలో జనరల్‌స్టోర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అయోధ్య గ్రామానికి చెందిన గొర్రెల కాపరి దుగ్గిళ్ల ఎర్రయ్య ఇటీవల రోడ్డు ప్రమా దంలో మరణించగా పశు సంవర్థక శాఖ ద్వారా మంజూరైన రూ. లక్ష చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు. జడ్పీటీసీ అశ్విని, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గన్నెరాజరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌లు రాజలింగం, ము త్యంరెడ్డి, వైస్‌ ఎంపీపీ మహేశ్వర్‌రావు, సర్పంచులు తహసీల్దార్‌ దిలీప్‌ నాయక్‌, ఎంపీడీవో సంతోష్‌కుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-06-26T05:57:41+05:30 IST