Abn logo
Oct 30 2020 @ 19:12PM

మా పోరాటం దేశానికి కాదు, బీజేపీకి వ్యతిరేకం: ఒమర్ అబ్దుల్లా

Kaakateeya

శ్రీనగర్: తాము చేసే పోరాటం దేశానికి వ్యతిరేకంగా కాదని, భారతీయ జనతా పార్టీ, దాని భావజాలానికి వ్యతిరేకమని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. శుక్రవారం జమ్మూ కశ్మీర్‌కు ఆగస్టు 5, 2019కి ముందు నాటి పరిస్థితి (ఆర్టికల్ 370 పునరుద్ధరణ) తీసుకు రావడమే ఉద్దేశంగా ఏర్పడిన పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్‌తో కార్గిల్ డెమొక్రటిక్ అలయెన్స్ సమావేశం అయింది. జమ్మూ కశ్మీర్‌కు కావాల్సిన హక్కులపై ఈ రెండు కూటములు సుధీర్ఘంగా చర్చించాయి.


ఈ సమావేశం అనంతరం ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ ‘‘జమ్మూ కశ్మీర్‌కు రాజ్యాంగం ప్రకారం కల్పించాల్సిన హక్కులు కల్పించాలి. మేం కొత్తగా ఏం డిమాండ్ చేయడం లేదు. రాజ్యాంగంలో రాసి ఉన్న వాటినే అడుగుతున్నాం. మేము చేసే పోరాటం దేశానికి వ్యతిరేకంగా అని కొందరు ప్రచారం చేస్తున్నారు. మా పోరాటం దేశానికి కాదు భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ భావజాలానికి వ్యతిరేకం. మేము ఈ పోరాటంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు’’ అని అన్నారు.

Advertisement
Advertisement