ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంది: ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2021-09-13T00:48:21+05:30 IST

కొవిడ్-19 కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లాయి. ఇండియా కూడా అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంది. అయితే మన ఆర్థిక వ్యవస్థ అనతి కాలంలోనే పుంజుకుంది. ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం ఏర్పడినప్పుడు మేము పీఎల్‌ఐ (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్వెంటివ్) పథకాలను ప్రారంభించాం. అవి మంచి ఫలితాలను ఇచ్చాయి

ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంది: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: కోవిడ్ సమయంలో ఢీలా పడిన ఆర్థిక వ్యవస్థ అంతకంటే తొందరగా పుంజుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం అన్నారు. తాజా డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ బలపడిందని, ఏప్రిల్-జూన్ మధ్య 20.1 శాతం వృద్ధి సాధించామని ఆయన అన్నారు. ఇంకా ప్రధాని మాట్లాడుతూ ‘‘కొవిడ్-19 కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లాయి. ఇండియా కూడా అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంది. అయితే మన ఆర్థిక వ్యవస్థ అనతి కాలంలోనే పుంజుకుంది. ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం ఏర్పడినప్పుడు మేము పీఎల్‌ఐ (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్వెంటివ్) పథకాలను ప్రారంభించాం. అవి మంచి ఫలితాలను ఇచ్చాయి’’ అని మోదీ అన్నారు. అంతే కాకుండా 21వ శతాబ్దంలో మనల్ని మనం ప్రపంచ ఆర్థిక నాయకత్వంలో చూసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ అలాంటి స్థాయికి చేరడానికి చాలా అవకాశాలు ఉన్నాయని, వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలని మోదీ అన్నారు.

Updated Date - 2021-09-13T00:48:21+05:30 IST