పిండేశారంతే

ABN , First Publish Date - 2022-08-19T07:12:42+05:30 IST

ఓటీఎస్‌ పేరుతో జిల్లాలో పేదలపై వేధింపులకు దిగిన రాష్ట్ర ప్రభు త్వం అనుకున్నట్లే పంతం నెరవేర్చుకుంది. ఎప్పుడో దశాబ్ధాల కిందట అప్పటి ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు ముక్కుపిండి డబ్బులు వసూలు చేయడానికి చేపట్టిన ప్రయత్నాలు సఫలం చేసుకుంటోంది. కొన్నినెలలుగా ఏకంగా ఇళ్ల వద్దకు అధికారులను పంపి బెదిరింపులు, వేధింపులతో డబ్బులు కట్టించుకుంటూ ఖజానాను కాసులతో గలగల లాడించుకుంటోంది.

పిండేశారంతే

  • -జిల్లాలో ఓటీఎస్‌ పేరుతో పేదల నుంచి అడ్డగోలుగా డబ్బులు పిండేసిన ప్రభుత్వం
  • -లబ్దిదారులను బెదిరించి, భయపెట్టి ఇప్పటివరకు ఏకంగా రూ.20కోట్లు వసూలు
  • -సర్కారు వేధింపులు భరించలేక జిల్లాలో 35వేల మంది చెల్లింపులు
  • -అత్యధికంగా కాకినాడలో 1,126 మంది నుంచి రూ.3.64కోట్లు రాబట్టిన అధికారులు
  • -పెద్దాపురంలో రూ.3.58కోట్లు, పిఠాపురంలో రూ.3.43కోట్లు కలెక్షన్‌-ఇంకా 91వేల మంది నుంచి రూ.50కోట్లు పిండేలా ముమ్మర ప్రయత్నాలు 

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

ఓటీఎస్‌ పేరుతో జిల్లాలో పేదలపై వేధింపులకు దిగిన రాష్ట్ర ప్రభు త్వం అనుకున్నట్లే పంతం నెరవేర్చుకుంది. ఎప్పుడో దశాబ్ధాల కిందట అప్పటి ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు ముక్కుపిండి డబ్బులు వసూలు చేయడానికి చేపట్టిన ప్రయత్నాలు సఫలం చేసుకుంటోంది. కొన్నినెలలుగా ఏకంగా ఇళ్ల వద్దకు అధికారులను పంపి  బెదిరింపులు, వేధింపులతో డబ్బులు కట్టించుకుంటూ ఖజానాను కాసులతో గలగల లాడించుకుంటోంది. ఇందులోభాగంగా జిల్లాలో ఓటీఎస్‌ వసూళ్లను రికార్డుస్థాయిలో ఏకంగా రూ.20కోట్లకు చేర్చింది. ఇదంతా పేదలను పిండి అడ్డగోలుగా పెంచుకున్న రాబడే కావడం విశేషం. అంతేకాదు ఇంకా మరో 91వేలమంది నుంచి రూ.50 కోట్ల వరకు పిండడానికి సిద్ధమవుతోంది. సాధ్యమైనంత వేగంగా రిజిస్ట్రేషన్లు చేయించడంకోసం లబ్ధిదారులపై ఒత్తిడి తేవాలని అధికారులకు లక్ష్యాలు విధిస్తోంది.

ఎంత దారుణమో...

ఇళ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వాలు గృహనిర్మాణ సంస్థ ద్వారా గృహాలు నిర్మించి ఇవ్వడం ఎన్నోఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు రాష్ట్రంలో కొన్ని కోట్లమందికి ఇళ్లు కట్టించి ఇచ్చాయి. ఇందులో కొన్ని లబ్ధిదారుల సొంత డబ్బుతోను, మరికొన్ని రుణంగాను ఇచ్చి సొంతింటి కలను సాకారం చేశాయి. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన జగన్‌ ప్రభుత్వం ఖజానాను నింపడం కోసం ఎన్నడూ లేని కొత్త పథకాలతో పేదలను పిండడమే లక్ష్యంగా వ్యవ హరిస్తోంది. అందులోభాగంగా గతేడాది డిసెంబర్‌లో ఓటీఎస్‌ పేరుతో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని తీసుకువచ్చింది. దీని కింద గడచిన కొన్ని దశాబ్ధాల్లో ప్రభుత్వం ద్వారా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదా రులు ఇంకా చెల్లించ కుండా ఉన్న రుణ బ కాయిలు కట్టాలని ఆదేశాలు జారీ చేసిం ది. గ్రామీణప్రాంతాల లబ్ధిదారులు రూ.10వే లు, మున్సిపాల్టీల్లో రూ.15వేలు, కార్పొరే షన్‌ పరిధిలో రూ.20వేల చొప్పున చెల్లించాలని ప్రకటిం చింది. అలా చేస్తేనే యజమాని పేరుతో ఇళ్లు రిజిస్ట్రేషన్‌ చేస్తామని మెలిక పెట్టింది. దీంతో జిల్లాలో పేదలంతా ఉలిక్కిపడ్డారు. ఇప్పటివర కు ఎన్నో ప్రభుత్వాలు మారినా ఇలా ఇబ్బంది పెట్టలేదని, ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం తెచ్చిన పథకంతో డబ్బులు ఎక్కడ కట్టాలని లబ్ధి దారులు నెత్తీ నోరు బాదుకున్నారు. మరోపక్క ప్రభుత్వ ఆదేశాలతో సర్వే చేపట్టిన అధికారులు జిల్లాలో 1,26,577మంది ఓటీఎస్‌ కింద డబ్బులు చెల్లించాల్సి ఉందని లెక్కగట్టారు. ప్రభుత్వ ఆదేశాలతో గ్రామాల వారీగా ఓటీఎస్‌ వసూళ్లకు బృందాలుగా బయలుదేరారు. తీరా చేతిలో డబ్బులు కట్టలేక చాలామంది లబ్ధిదారులు చెల్లింపులకు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. ఓటీఎస్‌ డబ్బు కట్టకపోతే ఇళ్లు స్వాధీనం చేసుకుంటామని భయపెట్టింది. అర్ధరాత్రుళ్లు అధికారులను ఇళ్లకు పంపి ఇబ్బంది పెట్టింది. దీంతో చేసేదిలేక కొందరు లబ్ధిదారులు అప్పులు చేసి ప్రభుత్వానికి డబ్బులు కట్టడానికి ముందుకు వచ్చారు.

రూ.20కోట్లు దాటిన పిండుడు..

ఓటీఎస్‌ ద్వారా కాకినాడ జిల్లానుంచి రూ.70కోట్ల వరకు పిండాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. కానీ పురోగతి లేకపోవడంతో ఏకంగా కలెక్టర్‌, జేసీ రంగంలోకి దిగారు. గ్రామాలు, మండలాల వారీగా లక్ష్యా లు విధించి ఓటీఎస్‌ వసూళ్లు పెంచాలని కొన్నినెలల కిందట ఒత్తిడి తెచ్చారు. దీంతో పగలు, రాత్రి తేడా లేకుండా అధికారులు ఇళ్లపైకి వెళ్లి వసూళ్లు రాబట్టారు. దీంతో ఇప్పటివరకు జిల్లాలో 35,083 మంది బలవంతంగా ఓటీఎస్‌ డబ్బులు చెల్లించారు. తద్వారా రూ.20కోట్ల వర కు ఇప్పటివరకు ప్రభుత్వానికి డబ్బులు జమయ్యాయి. వీరికి రిజిస్ట్రేష న్లు కూడా పూర్తయ్యాయి. ఇందులో అత్యధికంగా కాకినాడ సిటీ నియో జకవర్గంలో 1,126 మంది నుంచి రూ.3.64కోట్లు అధికారులు పిండేశా రు. పెద్దాపురం నియోజకవర్గంలో 3,592మందినుంచి రూ.3.58 కోట్లు, పిఠాపురం నియోజకవర్గంలో 3,683మందినుంచి రూ.3.43కోట్లు కలెక్షన్‌ చేశారు. తునిలో 6,820మంది నుంచి రూ.2.38 కోట్లు, కాకినాడ రూర ల్‌, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాలనుంచి చెరో కోటిన్నరపైనే పిండేశారు. గుర్తించిన మొత్తం ఓటీఎస్‌ లబ్ధిదారుల్లో రిజిస్ట్రేషన్లు చేసు కున్న 35,083మందిని మినహాయిస్తే ఇంకా 91వేలమంది నుంచి డబ్బు పిండాల్సి ఉందని తాజాగా గృహనిర్మాణ సంస్థ లెక్క తేల్చింది. తద్వా రా రూ.50కోట్ల వరకు ఇంకా వసూలు చేయాల్సి ఉందని గుర్తించింది. ఈ లక్ష్యాలు పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారుల ద్వారా మండలాల్లో రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఒత్తిడి లేదని చెబుతు న్న ప్రభుత్వం ఓటీఎస్‌ వసూళ్లపై తరచూ సమీక్షిస్తుండడం విశేషం.

Updated Date - 2022-08-19T07:12:42+05:30 IST