నిప్పుకోడి రాళ్లు తిని కడుపు నింపుకుంటుందా? దీనిలో నిజమెంతంటే...

ABN , First Publish Date - 2022-06-01T17:04:48+05:30 IST

ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే నిప్పుకోడి...

నిప్పుకోడి రాళ్లు తిని కడుపు నింపుకుంటుందా? దీనిలో నిజమెంతంటే...

ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే నిప్పుకోడి గురించిన ఆసక్తికరమైన విషయాలు తరచూ వినిపిస్తుంటాయ. అవి  గులకరాళ్ళను తింటాయని, వాటి కడుపులో ఒక కిలో గులకరాళ్లు పడతాయని చెబుతుంటారు. దీనిలో కొంత నిజమున్నప్పటికీ ఇది పూర్తి వాస్తవంకాదు. నిజానికి నిప్పుకోడికి దంతాలు ఉండవు. అందుకే అవి గట్టి రాళ్లను తింటాయి. 


ఈ రాతి ముక్కలే వాటికి పళ్లలా పనిచేస్తాయి. నిప్పుకోడి ప్రతీదానిని మింగుతుంది. ఇవి దాని కడుపులోకి చేరాక.. కడుపులో ఉన్న గులకరాళ్లు ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపకరిస్తాయి. నిప్పుకోడి తన కడుపు నింపుకోవడానికి ఎక్కువగా మొక్కలు, ఆకులు, కీటకాలను తింటుంది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నిప్పుకోడి నీరు లేకుండా ఎక్కువ కాలం జీవిస్తుంది. నిప్పుకోడి జీవితకాలం 40 నుండి 45 సంవత్సరాలు. అవి పుట్టిన 6 నెలల తర్వాత పొడుగ్గా ఎదుగుతాయి. దాని శరీరం పూర్తిగా అభివృద్ధి చెందడానికి 3 నుండి 4 సంవత్సరాలు పడుతుంది. నిప్పుకోడి భూమిపై ఉన్న అన్ని జంతువులలోకెల్లా అతిపెద్ద కళ్ళు కలిగి ఉంటుంది. తక్కువ ఆహారం తీసుకునే నిప్పుకోడి బరువు 100 నుండి 150 కిలోల వరకు ఉంటుంది.

Updated Date - 2022-06-01T17:04:48+05:30 IST