రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌తో హృద్రోగాల ముప్పు

ABN , First Publish Date - 2020-03-11T16:03:06+05:30 IST

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌.. కీళ్ల నొప్పులు, వాపులకు కారణమయ్యే వ్యాధి. దీనితో బాధపడేవారికి హృద్రోగాల ముప్పు 50 నుంచి 70 శాతం ఎక్కువని డెన్మార్క్‌ శాస్త్రవేత్తలు

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌తో హృద్రోగాల ముప్పు

కోపెన్‌హగెన్‌, మార్చి 10 : రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌.. కీళ్ల నొప్పులు, వాపులకు కారణమయ్యే వ్యాధి. దీనితో బాధపడేవారికి హృద్రోగాల ముప్పు 50 నుంచి 70 శాతం ఎక్కువని డెన్మార్క్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఎముకలు గుల్లబారే వ్యాధి(అస్టియో ఆర్థరైటిస్‌) బాధితులకు గుండె జబ్బుల ముప్పు 24 శాతం ఎక్కువగా ఉంటుందన్నారు. హృద్రోగాలు కలిగిన యుక్త వయస్కుల్లో సగం మంది ఏదో ఒక రకం కీళ్ల వ్యాధితో బాధపడుతున్నారని వెల్లడించారు. పురుషుల కంటే మహిళలకు ఈ వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉందని హెచ్చరించారు. సముద్ర ఆహారం, ఫిష్‌ ఆయిల్‌, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ కలిగిన నూనెల వాడకంతో హృద్రోగాలు, కీళ్ల వాపులను కట్టడి చేయవచ్చన్నారు. 

Updated Date - 2020-03-11T16:03:06+05:30 IST