Abn logo
Oct 27 2021 @ 09:04AM

Osmania Hospital: స్టెత్‌స్కోప్‌.. విత్‌ హెల్మెట్‌..!

‘ఉస్మానియా’లో వైద్యుల వినూత్న నిరసన

హైదరాబాద్/మంగళ్‌హాట్‌: ఉస్మానియా ఆస్పత్రి భవనాలు ప్రమాదకరంగా మారాయని, వెంటనే నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ జూనియర్‌ డాక్టర్లు మంగళవారం వినూత్న నిరసన చేపట్టారు. హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు. సోమవారం ఫ్యాన్‌ ఊడి పడడంతో వైద్యురాలు భువన శ్రీకి గాయాలయ్యాయి. దీంతో జూనియర్‌ డాక్టర్లు మంగళవారం ఓపీ భవనంలో హెల్మెట్లు ధరించి రోగులకు చికిత్సలు అందించారు. తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. 

ఇవి కూడా చదవండిImage Caption