Osman Sagar, హిమాయత్‌సాగర్‌లో పెరుగుతున్న నీటిమట్టం

ABN , First Publish Date - 2022-07-08T00:07:36+05:30 IST

ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జలాశయాల్లో నీటిమట్టం పెరుగుతోంది. భారీ వర్షాలతో జంట జలాశయాలకు వరద నీరు చేరుతోంది.

Osman Sagar, హిమాయత్‌సాగర్‌లో పెరుగుతున్న నీటిమట్టం

హైదరాబాద్: ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జలాశయాల్లో నీటిమట్టం పెరుగుతోంది. భారీ వర్షాలతో జంట జలాశయాలకు వరద నీరు చేరుతోంది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు.. ప్రస్తుతం 1785 అడుగులుకు నీరు చేరింది. హిమాయత్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1763 అడుగులు.. ప్రస్తుతం 1760 అడుగులు వరకు నీరు ఉంది. మరో 3 అడుగుల మేర నీరు వస్తే గేట్లు ఎత్తే అవకాశం ఉంది.


ఒకప్పుడు స్వచ్ఛమైన జలాలతో పారే మూసీ... నైజాం కాలంలో తాగునీటిని అందించిన హుస్సేన్‌సాగర్‌. నేడు కాలుష్య జలాలకు నిలయాలు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ మహానగరం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పట్టణీకరణ చోటు చేసుకోవడంతో మూసీ నదిలో మురుగునీరు ఏరులై పారుతుండగా హుస్సేన్‌సాగర్‌ సైతం మురుగునీరు, పరిశ్రమల వ్యర్థ రసాయన జలాల తటాకంగా మారింది. ఇక ఇప్పటికీ నగరానికి తాగునీరు అందిస్తున్న జంట జలాశయాలైన గండిపేట(ఉస్మాన్‌సాగర్‌), హిమాయత్‌సాగర్‌ చెరువుల నీళ్లను తాగుతున్నారంటే దానికి కారణం త్రిబుల్‌ వన్‌ జీవో (జీ.వో.నం.111) పుణ్యమేనని చెప్పవచ్చు.

Updated Date - 2022-07-08T00:07:36+05:30 IST