మళ్లీ ఒర్రెలొస్తాయ్‌!

ABN , First Publish Date - 2021-08-04T05:59:21+05:30 IST

గొల్లకుర్మలకు రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక యూనిట్‌ ధరను సైతం పెంచింది. దీంతో జిల్లాలో మరో 32,450మంది లబ్ధిదారులకుగొర్రె లు అందనున్నాయి. గొర్రెల పంపిణీ పథకాన్ని 2017- 18లో ప్రారంభించి తొలి విడత విజయవంతంచేశారు.

మళ్లీ ఒర్రెలొస్తాయ్‌!

రెండో విడత పంపిణీకి సన్నద్దం

యూనిట్‌ ధర రూ.1.75లక్షలకు పెంచిన ప్రభుత్వం

ఈ విడతలో 32,450 మందికి వర్తింపు

లబ్ధిదారులు చెల్లించాల్సిన వాటాదనం రూ.43,750

రెండు, మూడు రోజుల్లో మార్గదర్శకాలు?


నల్లగొండ, ఆగస్టు 3: గొల్లకుర్మలకు రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక యూనిట్‌ ధరను సైతం పెంచింది. దీంతో జిల్లాలో మరో 32,450మంది లబ్ధిదారులకుగొర్రె లు అందనున్నాయి. గొర్రెల పంపిణీ పథకాన్ని 2017- 18లో ప్రారంభించి తొలి విడత విజయవంతంచేశారు. పశు సంవర్థకశాఖ అధికారులు, ఉద్యోగులు ఇత ర జిల్లాలకు వెళ్లి గొర్రెలను కొనుగోలుచేసి లబ్ధిదారుల కు చేరవేశారు. తొలి విడతలో గొర్రెల రీసైక్లింగ్‌ చోటుచేసుకుంది. కొనుగోలు చేసిన గొర్రెలను లబ్ధిదారులు తిరి గి విక్రయించడంతో అధికారులు 80కేసులు నమోదు చేశారు. గొర్రెల రీసైక్లింగ్‌ చేయకుండా రాష్ట్ర సరిహద్దు ల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి నిఘాపెట్టారు. అయినా చాటుమాటునా గొర్రెల విక్రయం అక్రమంగా కొనసాగింద నే ఆరోపణలు వచ్చాయి. కాగా, కరోనా తీవ్రతతోపాటు పెరిగిన ధరల కారణంగా ఇంతకాలం గొర్రెల పంపిణీకి బ్రేక్‌ పడింది. చివరికి ప్రభుత్వం గొర్రెల యూనిట్‌ ధరను పెం చుతూ అర్హులైన లబ్ధిదారులందరికీ రెండో విడతలో జీవాలను పంపిణీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో మాదిరిగానే ఇతర రాష్ట్రాల్లో, అత్యధికంగా గొర్రెల సంపద ఉన్న ఏపీ రాష్ట్రంలోని గొర్రెలను కొనుగోలుచేసి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


రెండో విడతలో 32,450యూనిట్లు

రెండో విడత గొర్రెల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ప్రారంభించిన అనంతరం జిల్లాలో వారం రోజుల్లో పంపిణీకి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అందుకు లబ్ధిదారుల నుంచి డీడీలను తీసుకోవాల్సి ఉంది. గతంలో పేర్లను నమోదు చేసుకున్న లబ్ధిదారులతో పాటు కొత్తగా అర్హులైన వారికి సైతం గొర్రెలు పంపిణీ చేసేందుకు అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ విడతలో 32,450మందికి గొర్రెలు పంపిణీ చే యనున్నారు. రెండు విడతలకు సంబంధించి 65,050 మంది లబ్ధిదారులను 2017లోనే గుర్తించారు. అయితే చాలామంది అప్పట్లో పేర్లు నమోదు చేసుకోలేదు. వా రందరికీ ఈ విడతలో అవకాశం కల్పించేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. కొత్తగా మరికొంతమంది లబ్ధిదారులు పెరగనుండటంతో అందుకు అనుగుణంగా గొర్రెల యూనిట్లు పంపిణీ చేయనున్నారు. మొత్తం 21గొర్రెలు ఒక యూనిట్‌లో ఉండగా, ఒక గొర్రెపోటేల్‌, 20 గొర్రెలు ఉండనున్నాయి.


యూనిట్‌ కాస్ట్‌ పెంపు

మార్కెట్‌లో గొర్రెల ధరలు పెరగడంతో పథకం కొనసాగింపుపై ప్ర భుత్వం ఇంతకాలం తత్సారం చేసింది. అయితే పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం సైతం గొర్రెల యూనిట్‌ కాస్ట్‌ను పెంచింది. గతంలో రూ.1.31లక్షలు ఉండగా, అదనంగా రూ.44వేలు పెంచి యూనిట్‌ కాస్ట్‌ను రూ.1.75లక్షలు చేసింది. లబ్ధిదారులు వాటాగా రూ.43,750 చొప్పున డీడీ తీయాల్సి ఉంటుంది. తొలి విడతలో డీడీలు కట్టిన వారు 700 మంది వరకు ఉన్నారు. వారు కూడా పెంచిన యూనిట్‌ కాస్ట్‌కు అనుగుణంగా వాటాధనం చెల్లించాలి. మొదటి విడతలో 3,150 మంది డీడీ తీయలేదు.వారికి కూడా ఈ విడతలో అవకాశం కల్పించనున్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో యాదవులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.


రెండు, మూడు రోజుల్లో మార్గదర్శకాలు : సుబ్బారావు, పశుసంవర్థక శాఖ జేడీ, నల్లగొండ

రెండు, మూడు రోజుల్లో గొర్రెల యూనిట్ల పంపిణీకి మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్రస్థాయిలో జరిగిన సమావేశంలో దీనిపై చర్చ కొనసాగింది. గొర్రెల పంపిణీకి అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉంది. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే డీడీలు తీసుకొని లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేస్తాం.



అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇవ్వాలి : గుండెబోయిన నరేష్‌ యాదవ్‌, కొత్తపల్లి, హాలియా

ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీకి నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. రెండో విడత గొర్రెలను లబ్ధిదారులందరికీ త్వరితగతిన అందజేయాలి. మొదటి విడతలో డీడీ తీయని వారితో పాటు కొత్తవారికి సైతం రెండోవిడతలో అవకాశం కల్పించాలి. మార్కెట్‌లో ధరలకు అనుగుణంగా ప్రభుత్వం యూనిట్‌కాస్ట్‌ పెంచడం సంతోషకరం.


Updated Date - 2021-08-04T05:59:21+05:30 IST