Abn logo
Jul 31 2021 @ 15:30PM

అడ్రస్ కోసం అనాథల పోరాటం

ఖాజీపేట: అనాథలు తమ అడ్రస్ కోసం పోరుబాట పట్టారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలిసేందుకు ఖాజీపేట రైల్వేస్టేషన్ నుంచి ఢిల్లీ వెళ్లారు. అనాథల తరపున పోరాటం చేస్తున్న ‘మా ఇల్లు’ అనాథాశ్రమం నిర్వహకులు, తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లారు. అనాథలకు అడ్రస్, గుర్తింపుకార్డులు ఇవ్వకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఇన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సీజేఐ ఎన్వీ రమణ, ప్రధానితో సహ పలువురు కేంద్రమంత్రులను కలుస్తామని తెలిపారు.  

క్రైమ్ మరిన్ని...