ఓరోరీ దుర్యోధనా...!

ABN , First Publish Date - 2022-05-19T06:22:22+05:30 IST

‘రారా చేవుంటే నా దరికి. కాచుకోరా నా గదా ప్రహారానికి...’ అంటూ అహంకారంతో దుర్యోధనుడు చిందేస్తున్నాడు. భీమసేనుడు తొడగొట్టి అతనితో తలపడ్డాడు.గుడుపల్లె మండలం యామగానిపల్లెలో జరుగుతున్న ధర్మరాజుల మహాభారత ఉత్సవాల్లో చిట్టచివరి ఘట్టమైన దుర్యోధన వధ బుధవారంనాడు జరిగింది.

ఓరోరీ దుర్యోధనా...!
ఉత్సవంలో భీమదుర్యోధనుల యుద్ధం

వైభవంగా ముగిసిన యామగానిపల్లె ధర్మరాజుల ఉత్సవంలో ఆఖరిఘట్టం


కుప్పం/గుడుపల్లె, మే 18: ‘రారా చేవుంటే నా దరికి. కాచుకోరా నా గదా ప్రహారానికి...’  అంటూ అహంకారంతో దుర్యోధనుడు చిందేస్తున్నాడు. భీమసేనుడు తొడగొట్టి అతనితో తలపడ్డాడు. గదాదండంతో భీకర యుద్ధం చేసి ఆతడి ఊరువులను విరిచి కింద పడగొట్టాడు. గుడుపల్లె మండలం యామగానిపల్లెలో జరుగుతున్న ధర్మరాజుల మహాభారత ఉత్సవాల్లో చిట్టచివరి ఘట్టమైన దుర్యోధన వధ  బుధవారంనాడు జరిగింది. ఆలయం పక్కనే ఉన్న విశాలమైన మైదానంలో పంట పొలాల అంచున అతిపెద్ద దుర్యోధనుడి ప్రతిమను బంకమన్నుతో తీర్చిదిద్దారు. ఆ బొమ్మపైనే దుర్యోధన, భీమసేనుల భీకర యుద్ధం సాగింది. ఒకరికి మించి ఇంకొకరు పద్యాలు పాడుతూ, ఎరిగి దూకుతూ, క్రోధావేశాలతో పొంగుతూ, సాగించిన ఆ భీకర యుద్ధాన్ని భక్తజనం తిలకించారు.  దుర్యోధనుడు నేలకొరగగానే జేజేలు పలికారు. 




Updated Date - 2022-05-19T06:22:22+05:30 IST