కరోనా కట్టడికి సేంద్రియ మాస్కులు

ABN , First Publish Date - 2020-05-31T08:37:00+05:30 IST

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మార్కెట్‌ లో సేంద్రియ మాస్కులు వచ్చాయి. ఒడిశాకు చెందిన ఉత్కలికా కంపెనీ ఈ మాస్కులను ఉత్పత్తి చేసింది. సంబల్‌పురి పత్తితో తయారు చేసిన ఈ మాస్కులు వినియోగదారులను...

కరోనా కట్టడికి సేంద్రియ మాస్కులు

భువనేశ్వర్‌, మే 30 : కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మార్కెట్‌ లో సేంద్రియ మాస్కులు వచ్చాయి. ఒడిశాకు చెందిన ఉత్కలికా కంపెనీ ఈ మాస్కులను ఉత్పత్తి చేసింది. సంబల్‌పురి పత్తితో తయారు చేసిన ఈ మాస్కులు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. చేతితో తయారు చేసిన వీటిని ఉతకవచ్చని ఉత్కలికా కంపెనీ ఎండీ అంజనా పాండా తెలిపారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న చేతివృత్తుల వారికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఇటువంటి మాస్కులను త యారు చేయిస్తున్నామని వెల్లడించారు. 


Updated Date - 2020-05-31T08:37:00+05:30 IST