కమిషనర్‌ ఉత్తర్వులు.. కార్యదర్శి నిలుపుదల

ABN , First Publish Date - 2022-08-10T10:13:53+05:30 IST

ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ సస్పెన్షన్‌ ఉత్తర్వులను జారీ చేస్తే... విద్యా శాఖ కార్యదర్శి వాటిని తాత్కాలికంగా పక్కన పెట్టారు.

కమిషనర్‌ ఉత్తర్వులు.. కార్యదర్శి నిలుపుదల

ఇంటర్‌ బోర్డు అధికారిణి సస్పెన్షన్‌ విషయంలో విచిత్రం

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ సస్పెన్షన్‌ ఉత్తర్వులను జారీ చేస్తే... విద్యా శాఖ కార్యదర్శి వాటిని తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఇంటర్‌ బోర్డు అధికారిణి సస్పెన్షన్‌ విషయంలో గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం విచిత్రంగా మారింది. కారుణ్య నియామకంలో అవకతవకలు జరిగాయనే కారణంగా ఇంటర్‌ బోర్డులో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రసన్నలతను సోమవారం సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వు వెలుబడిన గంటల వ్యవధిలోనే అదే రోజు ఈ ఉత్తర్వులను అబయెన్స్‌లో పెడుతూ విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశాలను జారీ చేశారు. ఒకే రోజు ఈ పరిణామాలు చోటు చేసుకోవడం చర్చకు దారితీసింది.

Updated Date - 2022-08-10T10:13:53+05:30 IST