Delhi Riots: హైకోర్టు ఆదేశాలపై ఇప్పుడే జోక్యం చేసుకోమన్న సుప్రీం

ABN , First Publish Date - 2021-06-18T23:08:10+05:30 IST

గతేడాది ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లతో సంబంధం ఉందంటూ జేఎన్‌యూకి చెందిన 20 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై కఠినమైన ఉపా చట్టం మోపారు. కాగా మంగళవారం నటాషా నర్వాల్, దేవంగన కలిత, ఆసిఫ్ ఇక్బాల్ తన్హాలకు ఢిల్లీ హైకోర్టు

Delhi Riots: హైకోర్టు ఆదేశాలపై ఇప్పుడే జోక్యం చేసుకోమన్న సుప్రీం

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు సామాజిక ఉద్యమకారులను వెంటనే విడుదల చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తాము ఇప్పుడప్పుడే జోక్యం చేసుకోబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ విషయమై ఢిల్లీ పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ హేమంత్ గుప్త, జస్టిస్ రామసుబ్రహ్మణ్యం అనే ఇద్దరు జడ్జిలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ ‘‘బెయిల్ ఉత్తర్వులను ఇప్పుడే అంటే కుదరదు, త్వరలో పరిశీలిస్తాం’’ అని పేర్కొన్నారు.


గతేడాది ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లతో సంబంధం ఉందంటూ జేఎన్‌యూకి చెందిన 20 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై కఠినమైన ఉపా చట్టం మోపారు. కాగా మంగళవారం నటాషా నర్వాల్, దేవంగన కలిత, ఆసిఫ్ ఇక్బాల్ తన్హాలకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే చిరునామాల ధృవీకరణ, విధానపరమైన అడ్డంకుల కారణంగా వారిని గురువారం వరకు కూడా విడుదల చేయలేదు. దీంతో ఈ విషయమై గురువారం కూడా స్పందించిన స్పందించిన ఢిల్లీ హైకోర్టు.. ముగ్గరు ఉద్యమకారుల్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే వీరి విడుదలను సవాల్ చేస్తూ ఢిల్లీ పోలీసులు సుప్రీంను ఆశ్రయించారు.

Updated Date - 2021-06-18T23:08:10+05:30 IST