దూసుకొస్తున్న అల్పపీడనం

ABN , First Publish Date - 2021-11-25T13:03:08+05:30 IST

శ్రీలంకకు ఆగ్నేయదిశగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అంచలంచెలుగా బలపడుతూ తమిళనాడు కోస్తా తీరంవైపు పయనిస్తోంది. ఈ కారణంగా రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నం ఒక

దూసుకొస్తున్న అల్పపీడనం

                 - ఉత్తర జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ 


అడయార్‌(చెన్నై): శ్రీలంకకు ఆగ్నేయదిశగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అంచలంచెలుగా బలపడుతూ తమిళనాడు కోస్తా తీరంవైపు పయనిస్తోంది. ఈ కారణంగా రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నం ఒక మోస్తరు వర్షం కురిసింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా పయనిస్తూ కోస్తా తీర జిల్లాల వైపు దూసుకొస్తోంది. ఈ కారణంగా సాధారణం నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దీనికితోడు ఉత్తరభారతం నుంచి చలిగాలులు భూమిని తాకడం వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తమిళనాడులో పొగమంచు కనిపించింది. దీనికితోడు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా వీచే గాలుల ప్రభావం కారణంగా నామక్కల్‌, సేలం, పెరంబలూరు, అరియలూరు జిల్లాల్లో వర్షం పడింది. నేడు (గురువారం) అల్పపీడన ప్రభావం పెరగడం వల్ల వర్షప్రభావం పెరిగే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించింది. ఫలితంగా 26, 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర తమిళనాడు జిల్లాలైన చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, రాణిపేట, వేలూరు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ కారణంగా ఈ జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈనెల 30వ తేదీ వరకు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

Updated Date - 2021-11-25T13:03:08+05:30 IST