POCSO Actపై అలహాబాద్ హైకోర్టు సంచలన ఉత్తర్వులు

ABN , First Publish Date - 2021-11-24T17:46:22+05:30 IST

పోక్సో చట్టంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది....

POCSO Actపై అలహాబాద్ హైకోర్టు సంచలన ఉత్తర్వులు

అలహాబాద్ : పోక్సో చట్టంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్‌తో ఓరల్ సెక్స్ అనేది పోక్సోలోని తీవ్రమైన లైంగిక వేధింపుల పరిధిలోకి రాదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది.పోక్సో చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం శిక్షార్హమైన నేరం ‘పెనెట్రేటివ్ లైంగిక వేధింపు’ కేటగిరీలోకి వస్తుందని తీర్పులో కోర్టు పేర్కొంది. ఈ తీర్పును వెలువరిస్తూనే పదేళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి జైలు శిక్షను కూడా హైకోర్టు తగ్గించింది.2016 వ సంవత్సరంలో ఝాన్సీ జిల్లాలో ఫిర్యాదుదారుని 10 ఏళ్ల కుమారుడితో ‘ఓరల్ సెక్స్’ చేశాడని ఆరోపిస్తూ ఒక వ్యక్తిపై కేసు నమోదైంది.ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బాలుడిని బెదిరించారు.


 ఈ సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377, 506 నేరపూరిత బెదిరింపు, పోక్సో చట్టంలోని సెక్షన్ 3/4 కింద కేసు నమోదు చేశారు.10 ఏళ్ల జైలు శిక్షపై దోషి  ఝాన్సీ పోక్సో చట్టం అదనపు సెషన్స్ జడ్జి/స్పెషల్ జడ్జిల ద్వారా అప్పీల్ చేశారు. అలహాబాద్ హైకోర్టు అప్పీల్‌ను పాక్షికంగా ఆమోదించింది. దోషికి 10 సంవత్సరాలకు బదులుగా ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.

Updated Date - 2021-11-24T17:46:22+05:30 IST