వారికి..ఓపీఎస్‌ ఓకే

ABN , First Publish Date - 2022-09-08T06:28:21+05:30 IST

సీపీఎస్‌ రద్దుకోసం ఏళ్ళ తరబడి ఉద్య మాలు నడుస్తున్నవేళ... డీఎస్సీ–2003 రిక్రూట్‌ మెంట్‌లో ఉపాధ్యాయ ఉద్యో గాలు పొందినవారికి ఇది ఓ రకంగా తీపికబురే.

వారికి..ఓపీఎస్‌ ఓకే

2004 సెప్టెంబరు 1కి ముందు వెలువడిన 

ఉద్యోగ ప్రకటనలకు పాతపెన్షన్‌ వర్తింపు

ఉద్యోగుల వివరాలు కోరిన ట్రెజరీ

ఏలూరు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 7 : సీపీఎస్‌ రద్దుకోసం ఏళ్ళ తరబడి ఉద్య మాలు నడుస్తున్నవేళ... డీఎస్సీ–2003 రిక్రూట్‌ మెంట్‌లో ఉపాధ్యాయ ఉద్యో గాలు పొందినవారికి ఇది ఓ రకంగా తీపికబురే. సీపీఎస్‌ అమల్లోకి వచ్చిన 2004 సెప్టెంబరు 1వతేదీ తర్వాత ఉద్యో గాలు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ సీపీ ఎస్‌ను వర్తింప జేస్తుండగా, నిబంధనల ప్రకారం తమకు పాత పెన్షన్‌ (ఓపీఎస్‌)ను వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. డీఎస్సీ–2003 రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ అదే సంవత్సరం డిసెంబరులో విడుదల కాగా, ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన 2004 ఆగస్టులో పూర్తయ్యాయి. ఇక రాష్టంలో సీపీఎస్‌ అమలు 2004 సెప్టెంబరు ఒకటో తేదీనుంచి ప్రారంభమైంది. ఆ మేరకు పాతపెన్షన్‌ విధానాన్నే తమకు వర్తింప జేయాలంటూ డీఎస్సీ– 2003 ఉపాధ్యాయులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నా పట్టించు కోకుండా సీపీఎస్‌నే అమలు చేస్తున్నారు. సాంకేతికంగా డీఎస్సీ నియామక ప్రక్రియ అంతా 2003 నోటిఫికేషన్‌కి సంబంధించే కావడం, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కూడా సీపీఎస్‌ అమల్లోకి రాకముందే పూర్తయినందున తాము ఓపీఎస్‌కు అర్హులమేనన్నది ఉద్యోగ, ఉపాధ్యాయుల వాదన. ఇక డీఎస్సీ–2002 రిక్రూట్‌మెంట్‌ హిందీ సబ్జెక్టు నియామకాలపై కొందరు కోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు తీర్పు వచ్చి నియామకాలు జరిగేసరికి 2007వ సంవత్సరం వచ్చింది. ఫలి తంగా వీరికి కూడా సీపీఎస్‌నే అమలు చేస్తున్నారు. వీరి సంఖ్య తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇటీవల సీపీఎస్‌, ఓపీఎస్‌లపై స్పష్టతనిచ్చింది. 2004 సెప్టెంబరు 1వ తేదీకి ముందు జరిగిన ఉద్యోగ నియామకాలన్నింటికీ ఓపీఎస్‌ని వర్తిపజేయాలంటూ అన్ని రాష్ట్రాలకు సూచించింది. దీంతో డీఎస్సీ –2002, 2003 రిక్రూట్‌ మెంట్లలో ఎంపికైన ఉపాద్యాయులతో పాటు, వివిధశాఖల్లో ఉద్యోగాలు పొందినవారికి కూడా ఓపీ ఎస్‌ను వర్తింపజేయడానికి మార్గం సుగమమైంది. ఈ క్రమంలో సంబంధిత సంవత్సరాల్లో నియమితులైన ఉద్యోగ, ఉపాధ్యాయుల వివ రాలను ఈనెల 15వ తేదీలోగా పంపాలని ఖజానా శాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల డీటీవోలు, ఎస్టీవోలకు కొద్దిరోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్టంలో డీఎస్సీ–2003 రిక్రూట్‌ మెంట్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాలను 6,152 మంది పొందగా, వీరిలో ఉమ్మడి జిల్లాకు చెందినవారు 496 మంది ఉన్నారు. కాగా వీరికి ఓపీఎస్‌ను వర్తింప జేయడంపై రాష్ట్రప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను ఇంతవరకు జారీ చేయలేదు.

Updated Date - 2022-09-08T06:28:21+05:30 IST