జీపీఎస్‌ కాదు.. ఓపీఎస్‌ ఇచ్చి మాట నిలుపుకోవాలి

ABN , First Publish Date - 2022-05-15T08:38:12+05:30 IST

జీపీఎస్‌ కాదు.. ఓపీఎస్‌ ఇచ్చి మాట నిలుపుకోవాలి

జీపీఎస్‌ కాదు.. ఓపీఎస్‌ ఇచ్చి మాట నిలుపుకోవాలి

సచివాలయ ఉద్యోగులకు పరీక్ష నిబంధన సరికాదు: బొప్పరాజు


అనంతపురం టౌన్‌, మే 14: ‘‘అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తానని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ఆయన దానిని నిలుపుకోవాలి. ఆ మేరకు జీపీఎస్‌ కాదు... ఓపీఎస్‌ ఇవ్వాలి’’ అని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. శనివారం అనంతపురం వచ్చిన ఆయన నగరంలోని కృష్ణకళామందిర్‌లోని రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీపీఎస్‌ రద్దుకు మూడేళ్లుగా 2 లక్షల మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు. ఇప్పుడు సీపీఎస్‌ బదులు జీపీఎ్‌సను ప్రభుత్వం తెరపైకి తీసుకురావడం అందరినీ ఆవేదనకు లోనుచేస్తోందన్నారు. సచివాలయ ఉద్యోగులు పరీక్ష పాసైతేనే రెగ్యులర్‌ చేస్తామనడం సరికాదన్నారు. జూన్‌ 30 నాటికి పరీక్షలు పాస్‌ నిబంధనతో సంబంధం లేకుండా 1.10 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసి, పేస్కేల్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అర్హత, నిబంధనల మేరకు ఎంపికైన కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని సీఎం మాటిచ్చారనీ, దానిని నిలుపుకోవాలని బొప్పరాజు కోరారు.

Updated Date - 2022-05-15T08:38:12+05:30 IST