అన్ని రంగాల్లోనూ కాపుల అణచివేత

ABN , First Publish Date - 2022-08-01T05:15:42+05:30 IST

రాష్ట్రంలోని కాపులు అన్ని రంగాల్లోనూ అణచివేతకు గురవుతున్నారని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గాని, ఆయన పార్టీ గాని ఆ వర్గానికి తీరని అన్యాయం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు ఆరోపించారు.

అన్ని రంగాల్లోనూ కాపుల అణచివేత
విలేకరులతో మాట్లాడుతున్న కళావెంకటరావు


టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళావెంకటరావు
చీపురుపల్లి, జులై 31:
రాష్ట్రంలోని కాపులు అన్ని రంగాల్లోనూ అణచివేతకు గురవుతున్నారని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గాని, ఆయన పార్టీ గాని ఆ వర్గానికి తీరని అన్యాయం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు ఆరోపించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కల్పించిన రాయితీలు, రాజకీయ ప్రాధాన్యత ఇప్పుడు కనిపించడం లేదన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కాపుల్ని ఎదగకుండా ముఖ్యమంత్రి అణచివేస్తున్నారని మండిపడ్డారు. కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు ద్వారా ఆ వర్గానికి ఏం చేసారో చెప్పాలని కళా ప్రశ్నించారు. జీవోలు తప్ప ఎవరికీ కుర్చీలు కూడా లేవని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయంలో ఉభయ పార్లమెంటు సభల్లో సుమారు 15 మంది ఎంపీలుండేవారన్నారు. తమ నాయకుడు చంద్రబాబు 5 శాతం ఎంపీ సీట్లను కాపులకు కేటాయించారని ఆయన గుర్తు చేశారు. ప్రచారానికే తప్ప కాపు నేస్తం వల్ల ఆ వర్గానికి ఒరిగిందేమిటో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాపులకు రాజకీయ ప్రాధాన్యతతో పాటు రాయితీలు, రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో నాయకులు రౌతు కామునాయడు, దన్నాన రామచంద్రుడు, పైల బలరాం, ముల్లు రమణ, ఇజరోతు రాంబాబు, గవిడి నాగరాజు, ఆరతి సాహు, సబ్బి సోనియా, గడే సన్యాసప్పలనాయుడు, అప్పలనాయుడు తదితరులున్నారు.


Updated Date - 2022-08-01T05:15:42+05:30 IST