ఢిల్లీ: డ్రగ్స్ అంశంపై ప్రతిపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని హోం మంత్రి సుచరిత తప్పుబట్టారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆశి ట్రేడర్స్ విజయవాడ కేంద్రంగా పనిచేయడం లేదని తెలిపారు. ఆశి ట్రేడర్స్ డ్రగ్స్ విషయాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌కు సంబంధించిన వివరాలు పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. విశాఖలో గతం నుంచే మావోయిస్టుల ప్రభావం ఉందని తెలిపారు. మావోయిస్టుల ప్రభావానికి రాష్ట్ర రాజధాని అంశానికి సంబంధం లేదని సుచరిత పేర్కొన్నారు.