హైదరాబాద్: సభ్యులు చర్చకు ఇచ్చే అంశాలను బట్టి అసెంబ్లీ నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు. కరోనా అదుపులో ఉండటంతో అసెంబ్లీ ఎక్కువ రోజులు జరపాలని నిర్ణయం ప్రతిరోజు ప్రశ్నోత్తరాలు, జీరో అవర్లో సభ్యులకు అవకాశం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం తరపున ఐటీ, ఇండస్ట్రీ, హరితహారం అంశాలపై చర్చిస్తామని, బిల్లులపై సభ్యులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని సీఎం సూచించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అసెంబ్లీ వేదికగా చేరవేయాలన్నారు. ముఖ్యమైన అంశాలకు కావలసినంత సమయం కేటాయించాలని, అసెంబ్లీలో కొత్త నిబంధనలు రూపొందించుకొని దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నా విపక్షాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని తెలిపారు. ఇక ముందు కూడా ఇదే పద్ధతి కొనసాగుతుందని కేసీఆర్ ప్రకటించారు.